Thursday, December 19, 2024

ఆర్టీసీలో ఉద్యోగులపై వేధింపులు..

- Advertisement -
- Advertisement -

రాజంపేట్: ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకోనే బాద్యత తమపై ఉందని నాడు నష్టాలలో ఉన్న ఆర్టీసీని నేడు లాభాలలోకి తీసుకోస్తున్న ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకోని వారి సాదక బాదలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనర్, చైర్మెన్‌ల ఆదేశాలను ఆర్టీసీ ఉన్నత అధికారులు నిర్లక్షం చేస్తున్నారు. ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులపై ఇబ్బందులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలను ఆసరగా చేసుకోని ఉద్యోగులపై కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతున్నారు. తనిఖీల సమయంలో టిటిఐలు వేదింపులు ఇటివల కాలంలో ఎక్కువ అయ్యాయి. టిటిఐలు తమ టార్గెట్‌లు లక్షంగా చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపి సంబందిత డ్రైవర్, కండక్టర్లకు మోమెలు జారి చేస్తున్నారు.దీంతో డిపోస్పేర్, సస్పెన్షన్, రిమువల్ ఇతర కారణాలతో ఉద్యోగులపై వేదింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివిద కారణాలకు గురైన ఉద్యోగులకు విచారణ చేపట్టి త్వరితగతిన పైల్ వెంటనే సంబందిత అధికారులకు పంపాలి కాని విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఏమిటని ప్రశ్నిస్తే మాకు ఎదురు మాట్లాడుతారా అంటు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే డ్రైవర్‌లను టిమ్ కండక్టర్‌ల పేరుతో నానా ఇబ్బందులు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎవరు చేయాల్సిన పనిని వారు చేయకుండా నిర్లక్షంగా వ్యవహరించడంతో కోంతమంది ఉద్యోగులు నష్టపోతున్నారని వాపోతున్నారు. మాట వింటావా లేక బదిలీపై వెళ్తావా అంటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని ఆర్టీసీ డిపోలు వింత పోకడలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మహిళ ఉద్యోగులకు తప్పని తిప్పలు

రాష్ట్ర ప్రభుత్వం మహిళ కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే డ్యూటిలు ముంగింపు చేయాలని ఆదేశాలు జారి చేసిన అట్టి ఆదేశాలను తుంగలో తోక్కుతున్నారు. మహిళ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కోన్ని సమయాలలో రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వహించి తమ ఇంటికి ఏలా వెళ్ళాలో అర్థం కాక అనేక అవస్థలు పడుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకా మనోవేదనకు గురి అవుతున్నారు. ఉద్యోగ సంఘాలవి కాని ఉద్యోగుల సమస్యలపై పోస్టు చేసిన వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో ఆర్టీసిలో కార్మిక సంఘాలు ఉండేవి, కార్మికులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారి తరపున యూనియన్ నాయకులు స్పందించేవారు. కాని యూనియన్‌లు తీసివేసి ఉద్యోగుల సంక్షేమం కోసం వెల్పర్ కమిటీలను ఎర్పాటు చేశారు. అప్పటి నుండి సంఘాల ఉనికి కోల్పోయాయి. దీంతో తమ తరుపున అధికారులతో మాట్లాడేవారు లేకుండా పోయారని అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News