యాజమాన్యానికి నోటీసు
ఇచ్చిన కార్మిక సంఘాల
జెఎసి ప్రభుత్వంలో
విలీనం, రెండు పిఆర్‌సిల
చెల్లింపు సహా యాజమాన్యం
ముందు 21 డిమాండ్ల్లు
45 రోజుల్లోగా
పరిష్కరించకపోతే సమ్మె బాట
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఆర్‌టిసిలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె బాట పడుతామని కార్మిక సంఘాల జెఎసి ఆర్‌టిసి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. సోమవారం బస్‌భవన్‌లో జెఎ సి నేతలు అధికారులకు సమ్మె నోటీసు అందజేశా రు. సమ్మె నోటీసులో 21 డిమాండ్లను జెఎసి నేత లు యాజమాన్యం ముందుంచారు. వాటిని పరిష్కరించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి 45 రోజుల గడువు ఇస్తున్నామని అప్పటికీ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రంలోని అన్ని డి పోల కార్మికులు సమ్మెబాట పడుతారని సమ్మె నో టీసులో హెచ్చరించారు. ప్రభుత్వంలో ఆర్‌టిసి ఉ ద్యోగుల విలీనం, 2 పిఆర్‌సిల అమలు, సిపిఎస్, పిఎష్ డబ్బులు రూ. 2,700 కోట్లు చెల్లింపు తదితర 21 డిమాండ్లు యాజమాన్యం ముందు ఉం చారు.
డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొ నుగోలు, నిర్వహణను ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కార్మిక సంఘాల నేతలు కోరారు. ఆర్‌టిసిలో కొత్త గా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకుంటున్నారని, ఈ బస్సులు, అందులో పనిచేసే డ్రైవర్ ఆర్‌టిసికి సంబంధం లేదని జెఎసి నా యకులు పేర్కొన్నారు. ఈ బస్సు మీద ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకే చెందుతోందని, అందువల్ల ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్‌టిసికి అందజేయాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. ఆర్‌టిసి డీజిల్ బస్సులను రెట్రో ఫిట్‌మెంట్ పాలసీపై ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే విధానాన్ని మానుకోవాలని కోరారు.
ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం లేదని, యూనియన్లు రద్దు చేసి, కార్మికులకు పనిగంటలు పెంచారని, జెఎసి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
గతంలోనే నిర్ణయం తీసుకున్నాం : జెఎసి
ఆర్‌టిసి పరిరక్షణకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలంటూ సమ్మె నోటీస్ ఇవ్వాలని ఆర్‌టిసి జెఎసి ఈనెల 22న ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుందని ఆర్‌టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్‌ఛైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయలేదని వారు విమర్శించారు. ప్రైవేట్ సంస్థల ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో కార్పొరేట్ సంస్థలకు ఆర్‌టిసిని కట్టబెడుతున్నారని ఆరోపించారు.
14 నెలలైనా సమస్యలు పరిష్కారం కాలేదు : వెంకన్న
‘ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుందని, సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు అందరిని కలిశామని ఆర్‌టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు అయినా మా సమస్యలను పరిష్కరించలేదన్నారు. గత ప్రభుత్వం విలీన ప్రక్రియను 90 శాతం పూర్తి చేసింది, కాని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 2021 పీఆర్సీ ఇవ్వడంలేదన్నారు. 14 నెలలు సమయం ఇచ్చామని ఇక ఓపిక లేదని చెప్పారు. ఆర్‌టిసిని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రైవేటు బస్సులు ఆర్‌టిసిలో ప్రవేశపెట్టి సంస్థ మనుగడకే ప్రమాదం కలిగేలా చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2021 పిఆర్‌సిని ప్రకటించి బకాయిలు చెల్లించాలి : థామస్ రెడ్డి
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టు ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని జెఎసి వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అన్నారు. కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, 2021 పిఆర్‌సిని ప్రకటించి, 2017 బకాయిలు చెల్లించాలన్నారు. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలను కలిసి సమ్మెకు మద్దతు కూడగడుతామన్నారు.