Monday, December 23, 2024

ఆర్‌టిసి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా

- Advertisement -
- Advertisement -

యుబిఐతో ఆర్‌టిసి ఒప్పందం

రూపాయి ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్:   టిఎస్ ఆర్‌టిసి ఉద్యోగులకు ప్రమాద బీమా పెంచాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ బీమా రూ.1.12 కోట్ల వరకు వర్తింపు చేయాలని ఆర్టీసి నిర్ణయించింది. అందులో భాగంగా యూబీఐతో టిఎస్‌ఆర్టీసి ఒప్పందం చేసుకుంది. తమ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ)తో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రూ.40 లక్షల నుంచి రూ. కోటికి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్, యుబిఐ సిబిఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో అకాల మర ణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యుబిఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ (యుఎస్‌ఎస్‌ఎ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే కోట్ల వరకు ప్రమాద బీమాను యుబిఐ సహకారంతో బాధి త కుటుంబాలకు ఆర్‌టిసి సంస్థ అందించనుంది. ఫిబ్రవరి 01 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News