Monday, December 23, 2024

ప్రయోగాలకే పరిమితమైన ఆర్‌టిసి ఉమ్మడిస్మార్ట్ కార్డు సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రేటర్ ఆర్టీసీలో టికెట్ లెస్, క్యాష్ లెస్ సేవలను అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించి 7 సంవత్సరాలు దాటుతున్నా ఇంత వరకు వాటిని ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవు. ఎల్‌బినగర్ నుంచి లింగపంల్లి వరకు నడిచే (222) రూట్ 20 బస్సుల్లో ప్రతి రోజు 50కి పైగా ట్రిప్పుల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెడతామని, మూడు నెలల తరువాత దశల వారీగా కోటీ-పటాన్ చెరు, సికింద్రాబాద్-బీహెచ్‌ఈఎల్, దిల్‌షుక్‌నగర్- లింగంపల్లి తదితర లాంగ్ రూట్లలో స్మార్ట్ సేవలను విస్తరిస్తామని చెప్పినా ఇంత వరకు అవి ఎక్కడా కనిపించలేదు. దిల్‌షుక్‌నగర్. కోటీ, ఆబిడ్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లోని బస్ కేంద్రాల్లో ఈ స్మార్ట్ కార్డులను విక్రయిస్తామని, మొదటి విడతగా 1000 కార్డులను ముద్రించి అందిస్తామని చెప్పారు. ఈ కార్డు కేవలం ఆర్టిసిలోనే కాకుండా ఎంఎంటిఎస్, మెట్రో, ఇతర రవాణా సదుపాయాలకు కూడా వినియోగించడమే కాకుండా పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్‌లో కూడా వినియోగించు కోవచ్చని చెప్పారు.

ఆర్టిసి ప్రకటనతో ప్రయాణికులు ఎంతో సంతోషించారు. బస్సుల్లో చిల్లర సమస్య ఉండదని, ఎంచక్కా కార్డు వినియోగం ద్వారా ప్రయాణించి వచ్చని, సమయం కూడా ఆదా అవుతుందని బావించారు. అయితే అధికారులు ప్రకటించి ఆరు సంవత్సరాలు అవుతున్నా వాటి అమలు ఇంత వరకు అతిగతీ లేదు. ఐటి నగరంగా పేరు గాంచిన హైదరాబాద్‌లో అన్ని సేవలను మొబైల్ చెల్లింపులు చేస్తున్న తరణంలో ఆర్టిసి అధికారులు తీరుపై విమర్శలు వస్తున్నాయి. అన్ని రవాణా అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే కామన్‌మొబలిటి కార్డు ( సిఎంసి) ఆర్టిసి అధికారులు ఇంత వరకు ఆర్టిసి ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఈ అంశంపైగా గతంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ,ఆర్టిసి, మెట్రో, ఎంఎంటిఎస్, ఆటోయూనియన్ నాయకులతో సమావేశమయ్యారు.

మెట్రో కారిడార్ సమీపంలోని 100 ఆర్టిసి బస్సులు, 50 ఆటోలు, రెండు మెట్రో స్టేషన్లలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్న అధికారులు ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం చెప్పక పోవడంతో అది అటకెక్కినట్లే అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.హాంకాంగ్‌లో రకాల ప్రజారవాణ వ్యవస్థలో వినియోగిస్తున్న ఆక్టోపస్ కార్డుల తరహాలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులను విస్తరించాలనే ప్రతిపాదనలో ఉంది. అక్కడ 1997 నుంచి ఆక్టోపస్ కార్డులను రైలు, బస్సు, బోటు, ట్యాక్సీ తదితర అన్ని రకాల ప్రజారవాణాల్లో వినియోగిస్తున్నారు. ఈ కార్డు ద్వారా వినియోగదారుడు చెల్లించే మొత్తం సెంట్రల్ క్లియరింగ్ హౌజ్ (వివిధ రకాల బ్యాంకుల సేవల సముదాయం) ద్వారా 24 గంటల్లో ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News