Monday, March 31, 2025

బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం.. సజ్జనార్‌కు కీలక బాధ్యతలు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కొందరు సెలబ్రిటీలను పోలీసులు విచారించారు. అయితే ఇలా చేయడం ద్వారా బెట్టింగ్ యాప్‌లను పూర్తిగా నిర్మూలించ లేమని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్టిసి ఎండి సజ్జనార్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

బుధవారం సిట్‌ గురించి అసెంబ్లీలో ప్రకటన చేసే ముందు సిఎం ఓ సమావేశం నిర్వహించారు. శాసనసభలోని ఆయన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిజిపి జితేందర్, డిజి శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమీషనర్ సివి ఆనంద్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖా గోయల్‌తో పాటు సజ్జనార్‌ కూడా పాల్గొన్నారు. దీంతో ఈ సిట్ ఏర్పాటులో సజ్జనార్‌కి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News