హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
మన తెలంగాణ, హైదరాబాద్ : నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్‌టిసి ఎండి సజ్జన్నార్ సంస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఎండిగా బాధ్యతలు స్వీకరించిన రెండోరోజును ఆయన సిబ్బంది పనితీరు. ఇందులో భాగంగా జీడిమెట్ల డిపోకు చెందిన 9ఎక్స్/272( గండి మైసమ్మ.. అప్జల్‌గంజ్, సీబిఎస్ రూట్లో తిరిగే బస్సులో) లక్డికాపూల్ స్టేజ్ వద్ద బస్సు ఎక్కి తానెవరో కండక్టర్‌కు చెప్పకుండా సామాన్య ప్రయాణికుడిలా ఎంజిబిఎస్ వరకు టికెట్ తీసుకుని ప్రయాణిస్తూ ప్రయాణికులు అభిప్రాయాలను, సంస్థ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలను ప్రయాణికులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా సాధారణ వ్యక్తిలా బస్టాండ్‌లో తిరుగుతూ ప్లాట్‌ఫాం పరిశుభ్రతను ఏయే రూట్‌లలో బస్సులు ఏ సమయం తిరిగి అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా తార్నాకలోని ఆర్‌టిసి ఆసుపత్రిని కూడా సందర్శించి సిబ్బందికి అందుతున్న సేవలు, సంస్థ నుంచి అందుతున్నా సాయం వంటి వివరాలను తెలుసుకున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా కూడా ఆయన బస్సులోనే కుటుంబ సమేతంగా ఆర్‌టిసిలో బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
గతంలో ఆర్‌టిసి ఎండి బాధ్యతలు స్వీకరించిన వారెవరూ కూడా ఈ విధంగా బస్సుల్లో ప్రయాణించి ప్రయాణికులు, సాదక బాధలు తెలుసుకున్న సందర్భాలు లేవు. ఒక ఎండి స్థాయి వ్యక్తి సాధారణ ప్రయాణికుడిలా బస్సుల్లో ప్రయాణించడం పట్ల సాధారణ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నతాధికారి ఈ విధంగా చేయడంతో బస్సులు సమాయానికి రావడమే కాకుండా, బస్సులు శుభ్రంగా ఉంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, ఇతర ఆర్‌టిసి అధికారులు మాత్రం ఎండి ఎప్పుడు .. ఏ రూట్లో బస్సు ఎక్కుతారో… ఏ స్టేజిలో దిగుతురోఅయన ముందస్తు సమచారం ఇవ్వక పోవడంతో సిబ్బంది గత కొద్ది రోజులుగా అన్ని బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడమే కాకుండా, సమాయానికి ఆయా రూట్లలో బస్సులు తిరిగేలా చూస్తున్నారు. అంతే కాకుండా ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిండమే కాకుండా సిబ్బందిని ప్రత్యేకంగా బస్టాపల్ వద్ద డ్యూటీలు వేసి.
బస్సులు బస్‌బేలో ఆగి విధంగా చేయడమే కాకుండా, బస్టాపుల్లో తిష్టవేసుకుని ఉంటున్న ఆటోలను,ఇతర ప్రైవేట్ వాహనాలను వెంటనే తొలగిస్తూ బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులకు ఎటువంటి సమస్యా లేకుండా చూస్తూన్నారు. ఒక వైపు తమ విధులను నిర్వహిస్తూనే మరో వైపు ప్రైవేట్ రవాణా వ్యవస్థ అయిన ఆటోలు,బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తే వచ్చే సమస్యలను ప్రయాణికులకు వివరించి వారిని ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించే విధంగా చూస్తూ సంస్థకు ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. అంతే కాకుండా ఆయా రూట్లలో వచ్చే బస్సుల రాక పోకలను వివరాలను వివరించి ప్రయాణికులు మన్ననలు కూడా పొందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారిగా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించిన ఆయన సంస్థను గాడిలో పెట్టడమే కాకుండా సంస్థ ఆదాయాన్ని కూడా పెంచుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విధినిర్వాహణలో ఖచ్చితంగా ఉండే ఎండి సజ్జన్నార్ రాకతో ఇంత కాలం పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని కార్మిక సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.