Monday, December 23, 2024

ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

డీజిల్ బస్సు ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు !
త్వరలోనే రోడ్లపైకి
అది సక్సెస్ అయితే మరో వేయి బస్సులు అదే బాటలో…
డీజిల్ రేట్ల పెరుగుదలతో ఆర్టీసి సరికొత్త ఆలోచన

RTC plans with Decrease cost

మనతెలంగాణ/హైదరాబాద్:  ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ఆర్టీసి బస్సును ఎలక్ట్రికల్ బస్సుగా మార్చడానికి ఆ సంస్థ ఓ ప్రయోగాన్ని చేపట్టింది. అది సక్సెస్ అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వ అనుమతితో ముందుగా 1,000 బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఇటీవల 2,250 బస్సుల పునరుద్ధరణ

ఇప్పటికే బల్క్ బయ్యర్స్ డీజిల్ ధరలను పెంచడంతో ప్రైవేటు బంకుల్లో డీజిల్‌ను ఆర్టీసి బస్సులకు వాడుతున్నారు. దీనివల్ల రోజుకు రూ.40 లక్షల ఖర్చు ఆ సంస్థకు తగ్గుతుంది. రానున్న రోజుల్లో డీజిల్ వల్ల టికెట్ ధరలు పెంచాల్సి రావడం లాంటి సమస్యలను అధిగమించేలా ఆర్టీసి ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఆర్టీసి 37 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుండడంతో పాటు ఇటీవల కాలంలో 2,250 బస్సులను పునరుద్ధరించింది. దీంతో పాటు 850 కొత్త సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్రం రాయితీ ఇస్తే మరిన్ని అందుబాటులోకి…

ఇదిలా ఉండగా మరో 600 బస్సులు 15 ఏళ్ల సర్వీసు అయిపోవడంతో వాటిని పక్కన పెట్టాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే మూడు వందల ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు రూ.65 లక్షలు

మాములుగా డీజిల్ బస్సు నడపడానికి కిలో మీటరుకు రూ.20 ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సుకైతే కిలోమీటరుకు రూ.7 మాత్రమే అవుతుంది. కానీ, ఎలక్ట్రిక్ బస్సు కొత్తది కొనాలంటే దాదాపు రూ.2 కోట్లు ఖర్చు అవుతుంది. అదే డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసి)కి ఆలోచన వచ్చింది. ఈ మేరకు ముషీరాబాద్ డిపోకు చెందిన ఆర్డినరీ డీజిల్ బస్సును ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించి ఎలక్ట్రిక్ బస్సుగా మార్పించింది. ప్రస్తుతం ఆ బస్సు పనితీరును పరిశీలిస్తోంది. ఒక్కో డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేందుకు రూ.60- నుంచి 65 లక్షల దాకా ఖర్చు అవుతోంది. ఆ బస్సు పనితీరు మెరుగ్గా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో నడిచే 2,800 ఆర్టీసి బస్సుల్లో 50 శాతం బస్సులను దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలన్న ఆలోచనలో ఆర్టీసి అధికారులు ఉన్నారు. ఇప్పటికే మియాపూర్, కంటోన్మెంట్ డిపోల్లో 24కి పైగా ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

24 చార్జింగ్ పాయింట్లు

సాధారణంగా డీజిల్‌తో నడిచే బస్సులు 250 కిలోమీటర్లు తిరిగితే ఒక్కో కిలోమీటర్‌కు రూ.20 చొప్పున మొత్తం రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే ఎలక్ట్రిక్ బస్సుకు ఒక్క కిలోమీటర్‌కు రూ.7 చొప్పున 250 కిలోమీటర్లకు రూ. 1,750 మాత్రమే ఖర్చవుతుంది. డీజిల్ రేట్లు పెరిగిపోతుండడంతో ఆర్టీసిపై భారం నానాటికీ పెరిగిపోయి నష్టాలు మూటగట్టుకుంటోంది. ప్రభుత్వ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుకుంటే ఆర్టీసి నష్టాల బారి నుంచి రక్షించవచ్చని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు. కేంద్రప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్ధేశంతో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు మద్దతు ప్రకటించింది.

తెలంగాణకు 325 బస్సులు

ఈ క్రమంలో తెలంగాణకు 325 బస్సులు కేటాయించగా వాటిలో అత్యధికంగా 300 ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌కే కేటాయించారు. డిపోల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను గ్రేటర్ ఆర్టీసి ఓలెక్ట్రాతో కలిసి 40 ఎలక్ట్రిక్ ఎసి బస్సులను నగరంలో నడుపుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్లలో ఎక్కువగా బస్సులు నడుస్తు న్నాయి. కంటోన్మెంట్ డిపో నుంచి 22, మియాపూర్ 2 డిపో నుంచి 18 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. వీటికి చార్జింగ్ నిమిత్తం కంటో న్మెంట్, మియాపూర్ 2 డిపోల్లో 24 చార్జింగ్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News