- Advertisement -
కల్వకుర్తి: ప్రతి సంవత్సరం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న సలేశ్వరం జాతరకు భక్తుల సురక్షితమైన ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కల్వకుర్తి ఆర్టిసి డిపో మేనేజర్ శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు కల్వకుర్తి నుంచి సలేశ్వరంకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.
కల్వకుర్తి నుంచి సలేశ్వరం జాతరకు పెద్దలకు రూ.240, పిల్లలకు 120 రూపాయల టికెట్ ధరలు ఉన్నాయని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని, అదనంగా టోల్ ప్లాజా చార్జీలు వసూలు చేస్తారని తెలిపారు. ప్రజలు సురక్షితమైన ఆర్టిసి బస్సులలో ప్రయాణించి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలని, కల్వకుర్తి ఆర్‌టిసి బస్టాండ్‌లో ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -