Saturday, November 16, 2024

బస్ చార్జీల పెంపు సరైనదే

- Advertisement -
- Advertisement -

RTC ticket price increase is right decision!

ఆర్‌టిసి సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం

మనతెలంగాణ/హైదరాబాద్ : టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ చేపట్టిన ఓ సర్వేలో మెజార్టీ ప్రయాణికులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో పాటు నష్టాలను తగ్గించుకోవడానికి టికెట్ ధరల పెంపే సరైన నిర్ణయమని ఆర్టీసి అధికారులు భావించారు. అందులో భాగంగానే టికెట్ ధరల పెంపు గురించి ప్రయాణికుల మనోగతాన్ని తెలుసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఆర్టీసి డిపోలు, బస్టాండ్‌లలో ఈ సర్వేను నిర్వహించారు. నాలుగురోజుల పాటు జరిపిన ఈ సర్వేలో వివిధ రీజియన్‌లకు చెందిన డిపో మేనేజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో సుమారు 4.5 శాతం మంది (సుమారు 1,000) మంది ప్రయాణికులు టికెట్ ధరలను పెంచడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, సమయానికి అనుకూలంగా బస్సులను నడపాలని, ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈ సర్వే చేసిన ఆర్టీసి మేనేజర్లతో పేర్కొన్నారు. దీంతోపాటు కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసి సంస్థ, ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో చార్జీల పెంపు తప్పుకాదనీ ప్రయాణికులు సర్వేలో తమ అభిప్రాయాలను తెలిపారు.

9,700 వేల బస్సులు… 97 డిపోలు

ప్రస్తుతం ఆర్టీసికి రాష్ట్రవ్యాప్తంగా 9,700 వేల బస్సులు ఉండగా, 97 డిపోలు ఉన్నాయి. సుమారుగా ఆర్టీసిలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 41 లక్షలు ఉంటుంది. సుమారు 48వేల మంది డ్రైవర్‌లుగా, కండక్టర్‌లుగా మరికొంత మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో వివిద హోదాల్లో పనిచేస్తున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్‌లుగా ఉండగా ఉమ్మడి పాత జిల్లాలో 9 రీజియన్‌లు, హైదరాబాద్‌లో 2 రీజియన్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసి సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచాలని ఆర్టీసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పల్లె వెలుగు బస్సులకు కి.మీకు రూ.25 పైసలు, మిగతా సర్వీసులకు కి.మీకు రూ.30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

ఈ ప్రతిపాదనలను పంపే ముందు నవంబర్ 05వ తేదీ నుంచి 09వ తేదీ వరకు నాలుగురోజుల పాటు ఒక సర్వేను అన్ని రీజియన్‌ల పరిధిలో నిర్వహించింది. ప్రయాణికులు తెలిపిన వివరాలను ఆర్టీసి అధికారులు ప్రభుత్వానికి సైతం పంపించారు. మూడేళ్లలో ఆర్టీసికి సుమారుగా రూ.4,260 కోట్ల నష్టాలు రావడంతో దానిని లాభాల బాటలోకి తీసుకురావడానికి అధికారులు పలు ప్రయత్నాలను చేపట్టారు. అందులో భాగంగా ఆర్టీసి చార్జీల పెంపుపై సర్వే నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఆర్టీసి బస్సులను నడుపుతోంది. ప్రతిరోజూ 9,700 బస్సులు మూడు వేల రూట్లలో 33 లక్షల కిలోమీటర్ల ప్రయాణించి 41 లక్షల మందిని గమ్య స్థానానికి చేరుస్తున్నాయి.

ఆర్టీసి ప్రగతిరథ చక్రాలు మళ్లీ లాభాల బాటలో పయనించాలి
ఆర్టీసి ఎండి సజ్జనార్

ఆర్టీసి ప్రగతిరథ చక్రాలు మళ్లీ లాభాల బాటలో పయనించాలి. గతంలో కంటే 27.5 శాతం డీజిల్ ధరల్లో మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసి సంస్థపై ఇది అదనపు భారం. రోజుకు 6.8లక్షల లీటర్ల డీజిల్‌ను ఆర్టీసి బస్సులకు అవసర అవుతుంది. కరోనా లాక్‌డౌన్‌తో, పెరిగిన డీజిల్ ధరలతో నష్టాలు వస్తున్నాయి. డీజిల్ ధర పెరగడం వల్ల సంస్థకు రూ480 కోట్ల నష్టం వాటిల్లుతోంది. డీజిల్ ధర పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసి టిక్కెట్ ధరలు పెంచుతున్నాం. ప్రస్తుతం చార్జీలు పెరిగితే ఏడాదికి రూ.800 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుంది. రెండు సంవత్సరాల క్రితం 20 పైసల చొప్పున చార్జీలు పెంచిన ఆర్టీసికి లాభాలు రాలేదు. ఛార్జీలు పెంచితే ఆర్టీసి గాడిలో పడుతుందని ఆశిస్తున్నా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News