హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆర్టీసీ టిఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో టిఎంయూ నేత థామస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుని తెలిపారు. తెలంగాణ కోసం ఎంఎల్ సి కవిత ఎన్నో పోరాటాలు చేశారు. ఆర్టీసి ఉద్యోగుల కోసి ఈటెల చేసింది ఏమీ లేదు. ఎంఎల్ సి కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులుగా ఎవరైనా ఉండొచ్చున్నారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం గురించి ఈటెల మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నాడు. అలాంటి పార్టీలో ఈటెల ఎట్లా చేరుతడు అని థామస్ రెడ్డి ప్రశ్నించాడు. ఆర్టీసీని ఆదుకుంటున్నది సిఎం కెసిఆరే అని, బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.3వేల కోట్లు కేటాయించిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని అన్నారు. ఈటల రాజేందర్‌కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస, బలహీన వర్గాల సంక్షేమం కంటే ఆయనకు పదవులే ముఖ్యం అని మండిపడ్డారు.