Wednesday, January 22, 2025

తెలంగాణ ఏర్పాటులో ఆర్టిసి కార్మికులది కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -
  • బస్సు పాసులను అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి రూరల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆర్టిసి కార్మికులు కీలక పాత్ర పోషించారని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్టిసి కార్మికులు సమ్మెలో పాల్గొని బస్సు చక్రాన్ని ఆపడంతో తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిందని ఆయన అన్నారు. మంగళవారం కల్వకుర్తి ఆర్టిసి డిపో మేనేజర్ శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆర్టిసి రాయితీ బస్ పాసుల కోసం గోలి శ్రీనివాస్ రెడ్డి 25 వేల రూపాయలను డిపో మేనేజర్‌కు అందజేశారు. అంతకు ముందు డిఎం శ్రీకాంత్ గోలి శ్రీనివాస్ రెడ్డిని, ఇతర నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఆర్టిసి విలీనం చారిత్రక సంఘటన అని, చరిత్రలో స్వర్ణలిఖితమని అన్నారు. ఇక నుంచి ఆర్టిసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం కొన్ని ప్రాంతాలకు ప్రజల సౌకర్యార్థం గట్టిప్పలపల్లి, వెల్దండ మండలంలోని మారుమూల ప్రాంతాలకు, పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిఎం శ్రీకాంత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ సర్పంచ్ గోరెటి శ్రీనివాస్, ఆమన్‌గల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూరమల్ల సుభాష్, ఎంపిటిసి నాగులు, రాజశేఖర్, శరత్ శర్మ, కిరణ్, తక్కలపల్లి రాజేందర్, కార్మిక సంఘం నాయకులు యాదయ్య, మల్లయ్య, శంకర్ చారి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News