- Advertisement -
హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.దానం కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేసిన ఐఎఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా, డాక్టర్ అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా పనిచేసిన దానం, దళిత బహుజన మైనారిటీ వర్గాలకు విశేష సేవలందించారని సిఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సేవలందించారు.
- Advertisement -