Sunday, January 19, 2025

గత రెండేళ్లలో రాజ్యసభ ఎంపీలకు రూ.200 కోట్లు ఖర్చు

- Advertisement -
- Advertisement -

గత రెండేళ్లలో రాజ్యసభ ఎంపీలకు రూ 200 కోట్లు ఖర్చు
సమాచార హక్కు కింద బయటపడిన వివరాలు
న్యూఢిల్లీ: గత రెండేళ్లలో రాజ్యసభ ఎంపీలకు వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాల కింద దాదాపు రూ.200 కోట్లు ఖర్చు కాగా, ఈ మొత్తంలో రూ. 63 కోట్లు ప్రయాణాల భత్యాల కిందనే వెచ్చించడమైంది. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు బయటపడ్డాయి. 202122 లో కరోనా వైరస్ వ్యాప్తి తరువాత రాజ్యసభ సభ్యులకు రూ. 97 కోట్లు ఖర్చయ్యాయి. ఈ మొత్తంలో రూ. 28.5 కోట్లు స్వదేశీ ప్రయాణాలకు, రూ.1.28 కోట్లు అంతర్జాతీయ ప్రయాణాలకు ఖర్చయ్యాయి. వేతనాలుగా రూ. 57.6 కోట్లు చెల్లింపులు కాగా, వైద్యం కోసం చెల్లించిన బిల్లుల వ్యయం రూ.17లక్షలు, ఆఫీస్ ఖర్చులుగా రూ.7.5 కోట్లు వినియోగమయ్యాయి. ఎంపీలకు సమాచార సాంకేతికత సహాయం కింద రూ. 1.2 కోట్లు ఖర్చయ్యాయి. 202123 లో మొత్తం రూ. 100 కోట్లు ఖర్చయ్యాయి.

ఇందులో రూ.33 కోట్లు స్వదేశీ, విదేశీ ప్రయాణాలకు ఖర్చయ్యాయని మధ్యప్రదేశ్‌కు చెందిన చందర్ శేఖర్ గౌర్ సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రాజ్యసభ సెక్రటేరియట్ వివరాలు అందించింది. 202223 లో సభ్యుల వేతనాలుగా రూ. 58.5 కోట్లు చెల్లించగా, స్వదేశీ ప్రయాణాలకు రూ. 30.9 కోట్లు, విదేశీ ప్రయాణాలకు రూ. 2.6 కోట్లు ఖర్చు చేశారు. వైద్య చికిత్సలతో కలుపుకుని (రూ.65 లక్షలు), ఆఫీస్ ఖర్చుల కింద రూ.7 కోట్లు వ్యయమైంది. ఐటి సర్వీస్‌ల కింద రూ. 1.5 కోట్లు వినియోగమయ్యాయి. రాజ్యసభ మాజీ ఎంపీలకు డొమెస్టిక్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కింద 202122లో రూ.1.7 కోట్లు ఖర్చు కాగా, 202223లో రూ.70 లక్షలు ఖర్చయ్యాయి. 2021లో సభ్యుల ఉత్పాదక శాతం శీతాకాల సమావేశాల్లో 43 శాతం, వర్షాకాల సమావేశాల్లో 29 శాతం, బడ్జెట్ సమావేశాల్లో 90 శాతం వరకు ఉంది. తరువాతి సంవత్సరంలో శీతాకాల సమావేశాల్లో 94 శాతం, వర్షాకాల సమావేశాల్లో 42 శాతం, బడ్జెట్ సమావేశాల్లో 90 శాతం వరకు ఉత్పాదక శాతం కనిపించింది. ఈ ఏడాది ఇంతవరకు బడ్జెట్ సమావేశాల్లో అతి తక్కువగా 24 శాతం వరకే ఉత్పాదకత ఉండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News