Monday, December 23, 2024

మంకీపాక్స్‌ను గుర్తించే ఆర్‌టీపీసీఆర్ కిట్

- Advertisement -
- Advertisement -

RTPCR Kit to Detect Monkeypox

తయారు చేసిన ట్రివిట్రాన్ హెల్త్ కేర్

న్యూఢిల్లీ : మంకీపాక్స్ వైరస్ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కలవరపెడుతోంది. ఇప్పటికే 20 దేశాలకు ఈ వైరస్ విస్తరించగా, 200కు పైగా కేసులు బయటపడ్డాయి. మరో 100 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ కట్టడికి పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దేశానికి చెందిన మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాస్ హెల్త్‌కేర్ మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌టైమ్ పీసీఆర్ కిట్‌ను రూపొందించింది. ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిటి. ఇది వన్‌ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్, మంకీపాక్స్ తేడాను గుర్తిస్తుంది. ఈ కిట్ ద్వారా గంట లోనే ఫలితం తెలుసుకోవచ్చునని ట్రివిట్రాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కిట్‌తో టెస్టు చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతోపాటు వీటీఎం (వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా) స్వాబ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ చంద్ర గంజూ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా, అమెరికా సహా 20 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. వ్యాధి వ్యాప్తిని అరకట్టక పోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని డబ్లుహెచ్‌ఒ ప్రతినిధి డాక్టర్ సైల్వై బ్రైండ్ అభిప్రాయపడ్డారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్‌పై పనిచేస్తున్నాయా ? లేదా ? అన్న విషయంపై బ్రిటన్, జర్మనీ, కెనడా , అమెరికాలు పరిశోధన ప్రారంభించిన నేపథ్యంలో డబ్లుహెచ్‌వో నిపుణుల బృందం కూడా ఈ విషయమై పనిచేస్తోందని, త్వరలోనే మార్గదర్శకాలను అందిస్తామని చెప్పారు. మంకీపాక్స్ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు , చలి, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఏర్పడవచ్చు. క్రమేపీ అవి ఇతర శరీర భాగాలకు వ్యాపించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News