Saturday, December 21, 2024

రైల్వే స్టేషన్‌ టివిలో అసభ్య సందేశం…

- Advertisement -
- Advertisement -

పాట్నా: రైల్వే స్టేషన్‌లో టివి తెరపై అసభ్య సందేశం ప్రత్యక్షం కావడంతో పాటు పది నిమిషాలు ప్రసారమైన సంఘటన బిహార్ రాష్ట్రం భాగల్‌పూర్‌లో జరిగింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… భాగల్‌పూర్ రైల్వేస్టేషన్‌లో టివిలో రైల్వే వివరాలు సమాచారం వస్తుండగా ఒక్కసారి అసభ్యం సందేశాలు రావడంతో ప్రయాణికులు ఖంగుతిన్నారు. 5 నుంచి 10 నిమిషాల పాటు తెరపై కనిపించడంతో కొందరు ప్రయాణికులు తన సెల్‌ఫోన్లలో చిత్రీకరించగా మరికొందరు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. పాట్నా రైల్వే స్టేషన్‌లో టివి తెరపై నీలి చిత్రాలు ప్రసారమైన సంఘటన తెలిసిందే. ఏకంగా మూడు నిమిషాలు పాటు నీలి చిత్రాలు ప్రసారమయ్యాయి. టివిలో అసభ్య సందేశాల ప్రసారం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారి దనుంజయ్ కుమార్, డిఎస్‌పి అజయ్ కుమార్ చౌధరీ తెలిపారు.

Also Read: పురుషుల్లో వ్యంధత్వానికి వీలు కల్పించే కొత్త జన్యువు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News