Wednesday, January 15, 2025

‘రుద్రం కోట’ మూవీ రివ్యూ

- Advertisement -
- Advertisement -

ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జయలలిత కీలక పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘రుద్రం కోట’. ఈ చిత్రంలో అనిల్ ఆర్కా, విభిష జాను హీరో, హీరోయిన్లుగా, అలేఖ్య గాదంబోయిన కీలక పాత్రలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ మూవీ ‘రుద్రంకోట’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కథ : చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమైన రుద్రుడు( అనిల్ ఆర్కా) కి అన్నీ ఆ ఊరి పెద్ద కోటమ్మే(జయలలిత). తమ ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షించడం వీరి నైజం. ఆ ఊర్లో వీరి మాటకి ఎదురుండదు. రుద్రుడుకి స్వతహాగా అమ్మాయిలంటే అస్సలు నచ్చదు. అయినప్పటికీ అతన్ని శక్తి(విభీష జాను) గాఢంగా ప్రేమిస్తుంది. ఈ క్రమంలో కోటమ్మ మనవరాలు(అలేఖ్య) ఊరిలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె రుద్రుడి పై మోజు పడుతుంది. కానీ రుద్రుడు కోటమ్మ మనవరాలిని చేరనీయడు. అటు తర్వాత అతను కూడా శక్తిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని విధంగా శక్తి మరణిస్తుంది. ఆమె మరణానికి కారణం ఎవరు? కోటమ్మ , రుద్రుల జీవితం చివరికి ఎలా మారింది? కోటమ్మకి ఉన్న గతమేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

నటీనటుల పనితీరు : సీనియర్ నటి జయలలిత .. కోటమ్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసింది. ఈ పాత్రకి ఆమె నూటికి నూరు శాతం జీవం పోసింది అని చెప్పొచ్చు. రుద్రుడుగా అనిల్ ఆర్కా చాలా అద్భుతంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అతని పాత్ర ‘కాంతార’ లో రిషబ్ శెట్టిని గుర్తుచేస్తుంది అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ఇక హీరోయిన్స్ లో విభిష శక్తి పాత్రలో చాలా చక్కగా నటించింది. అలేఖ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈమె గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా అయ్యిందని చెప్పాలి. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ తప్పు చేస్తే ఎలాంటి ఘోరాలు జరిగాయో పురాణాల్లో చదువుకున్నాం, చరిత్ర కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంది. ఆధునిక యుగంలో స్త్రీలు ఎలా ఉండాలో ఈ సినిమాలో చాలా గొప్పగా చెప్పాడు దర్శకుడు రాము కోన. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ కట్టి పడేస్తుంది. అనిల్ ఆర్కా నిర్మాతగా కూడా సినిమా అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు.సుభాష్ ఆనంద్, యువి నిరంజన్.. సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ కూడా సినిమాకి హైలెట్ అని చెప్పాలి. శ్రీ రంగ డైలాగులు కూడా బాగున్నాయి. ‘కాలంతో పోయే అందం ముఖ్యం కాదు.. కాలం చేశాక కూడా అందరూ గుర్తుంచుకునే వ్యక్తిత్వం ముఖ్యం’ అనే డైలాగ్ గుర్తుండిపోతుంది.

చివరి మాట : ఈ వీకెండ్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు హ్యాపీగా థియేటర్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ‘రుద్రం కోట’.

నటీనటులు : సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత‌, అనిల్ ఆర్కా, విభిష జాను, అలేఖ్య గాదంబోయిన, బాచి, ర‌మ్య త‌దితరులు
డిఓపీః ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌
సంగీతంః సుభాష్ ఆనంద్‌ నిరంజ‌న్‌
ఎడిట‌ర్ః ఆవుల వెంకటేష్‌
కొరియెగ్ర‌ఫీః కీర్తి శేషులు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ , సుచిత్ర చంద్ర‌బోస్
ఫైట్స్ః జాషువా
డైలాగ్స్ః రంగ‌
లిరిక్స్ః సాగ‌ర్‌
నిర్మాతః అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి
స్టోరి-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః రాము కోన‌

రేటింగ్ : 3/5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News