రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌లో ఎమ్మెల్యే కవి, గాయకుడు, రసమయి బాలకిషన్ ‘రుద్రంగ’ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఫిల్మ్‌మేకర్స్ ’రుద్రంగి’ ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జగపతి బాబుని భీకరంగా, జాలి-, దయ లేని భీమ్ రావ్ దొరగా పరిచయం చేశారు. ఉత్కంఠ పెంచేలా ఉండే నేపథ్య సంగీతంతో ‘రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ’ అని జగపతి బాబు డైలాగ్‌తో ముగించేలోపు ప్రేక్షకుడి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో ’రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరుల తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.