Tuesday, January 28, 2025

కిరణ్ అబ్బవరంకు జోడీగా రుక్సర్ థిల్లాన్..

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా‘. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘దిల్ రూబా‘ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్ రూబా‘ సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా దిల్ రూబా సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది.

అరుదైన బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సినిమాను హై క్వాలిటీతో రూపొందించారు. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దిల్ రూబా‘ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ‘క‘ సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా‘ పై ఇటు ప్రేక్షకులు, అటు ట్రేడ్ సర్కిల్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News