Thursday, January 23, 2025

వర్గ స్పృహలేని ‘బహుజన’!

- Advertisement -
- Advertisement -

వర్గ స్పృహ అనే అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ముందుగా ఈ సమాజం అనేక కులాలతో ఏర్పడి ఉన్నా.. ఇది అంతిమంగా వర్గ సమాజం అని అర్థం చేసుకునే వర్గ చైతన్యం, శ్రామిక కులాల ప్రజల్లో ఉండాలి! ప్రతి కులంలోను వర్గం ఉంది. దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం. ఆధిపత్య అగ్ర కులాల్లో.. దోపిడీ చేసే వాళ్ళు అధిక శాతం ఉంటే, దోపిడీకి గురయ్యే వాళ్ళు తక్కువ శాతం ఉంటారు! ఇక అణగారిన అణచివేత కులాల్లో.. దోపిడీ చేసేవాళ్లు తక్కువ శాతం ఉంటే దోపిడీకి గురయ్యే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు! ఇక్కడ ఈ వర్గ స్పృహ లేకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉంది అంటే.. శ్రామిక కులాల్లో నుండి ఎదిగిన వారు తమ జాతిని విస్మరించి దోపిడీ వర్గాల్లో చేరిపోతున్నారు! శ్రామిక కులాల ప్రజలను కనీసం మనుషులుగా చూడని రాజకీయ పార్టీల్లో చేరి దోపిడీ వర్గాలవలెనే వీరు కూడా.. శ్రమ దోపిడీ మూలాల మీద, వారి జీవన మనుగడ కొనసాగిస్తున్నారు!

Article about jyotirao phule-ambedka life struggle

బహు జనులుగా పిలువబడుతున్న శ్రామిక కులాల ప్రజల్లో.. శ్రామిక వర్గ దృక్పథాన్ని పెంపొందించాల్సిందిపోయి వారిలో కులతత్వాన్ని నింపుతున్నారు అంబేడ్కర్ వాదులు! కులం కంటే కూడా కులతత్వం చాలా ప్రమాదకరమైనది! ఈ అశాస్త్రీయమైన విధానాలు అంతిమంగా.. శ్రామిక ప్రజల అనైక్యతకు, దోపిడీ వర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి! ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ కులాలకు చెందిన ప్రజలనే బహుజనులు అనీ అంటున్నారు. ఎందుకంటే ఇవి శ్రామిక కులాలు కాబట్టి. అయితే ‘బహు జనులకు రాజ్యాధికారం రావాలి’ అని చెబుతున్నప్పుడు బహుజనులుగా పిలువబడుతున్న శ్రామిక కులాల ప్రజలు ఏ దృక్పథాన్ని కలిగి ఉండాలి అనే అంశం ఇక్కడ కీలకమైంది. శ్రామిక కులాల ప్రజలకు శ్రామిక వర్గ దృక్పథాన్ని పెంపొందించాల్సిందిపోయి కేవలం కుల దృక్పథాన్నే నూరిపోస్తున్నారు బిఎస్‌పి, అంబేడ్కర్ వాదులు! కులం కంటే కూడా కులతత్వం ఎంతో ప్రమాదకరమైంది. అది ఆ కులాల ప్రజలకు, సమాజానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది!

మనుధర్మ భావజాలం అగ్ర కులాల్లోనే కాదు, అణచివేత కులాల్లో కూడా బలంగానే ఉంది! ఉదాహరణకు ఆనాడు లక్ష్మీపేటలో నష్టపరిహారం కింద ఎస్‌సి లకు కూడా చెందాల్సిన భూమిని బిసిలు అడ్డుకున్నారు. మాల, మాదిగా నా కొడుకులకు కూడా భూమి కావాలా? మీరు కూడా వ్యవసాయం చేస్తార్రా.. అంటూ ఎస్‌సి ప్రజల మీద బిసిలు దాడిచేసి గునపాలతో పొడిచి చంపారు! మరి ఈ రెండు కులాలు కూడా శ్రామిక కులాలే!అంతేగాకుండా, మనుధర్మ శాస్త్ర ప్రకారం వీరంతా శూద్రులే, అంటరాని వారే! మరి వీరిలో ఐక్యత లోపించడానికి కారణమేమిటి? అని ఆలోచించినప్పుడు.. శ్రామిక కులాల ప్రజల్లో సహజంగా ఉండాల్సిన వర్గ స్పృహకు బదులుగా.. కుల స్పృహ, కులతత్వం పెరిగిపోవడం ప్రధాన కారణం! కులతత్వం, మతతత్వం ఉన్న వారు మనుషుల్ని సమానంగా చూడరు! ఒక కులం కంటే మరో కులం తక్కువ, ఎక్కువ అనే వివక్ష, అసమానతలు వీరిలో జీర్ణించుకుపోతాయి! ఇక మరో ప్రధాన కారణం..

పెట్టుబడిదారీ సంస్కృతిని అధిగమించే చైతన్యం లేకపోవడం వల్ల.. ప్రజల మధ్య ఉండాల్సిన మానవీయ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారుతున్నాయి! ఇంతకూ వర్గ స్పృహ అనే అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ముందుగా ఈ సమాజం అనేక కులాలతో ఏర్పడి ఉన్నా.. ఇది అంతిమంగా వర్గ సమాజం అని అర్థం చేసుకునే వర్గ చైతన్యం, శ్రామిక కులాల ప్రజల్లో ఉండాలి! ప్రతి కులంలోను వర్గం ఉంది. దోపిడీ చేసే వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం. ఆధిపత్య అగ్ర కులాల్లో.. దోపిడీ చేసే వాళ్ళు అధిక శాతం ఉంటే, దోపిడీకి గురయ్యే వాళ్ళు తక్కువ శాతం ఉంటారు! ఇక అణగారిన అణచివేత కులాల్లో.. దోపిడీ చేసేవాళ్లు తక్కువ శాతం ఉంటే దోపిడీకి గురయ్యే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు! ఇక్కడ ఈ వర్గ స్పృహ లేకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉంది అంటే.. శ్రామిక కులాల్లో నుండి ఎదిగిన వారు తమ జాతిని విస్మరించి దోపిడీ వర్గాల్లో చేరిపోతున్నారు! శ్రామిక కులాల ప్రజలను కనీసం మనుషులుగా చూడని రాజకీయ పార్టీల్లో చేరి దోపిడీ వర్గాలవలెనే వీరు కూడా.. శ్రమ దోపిడీ మూలాల మీద, వారి జీవన మనుగడ కొనసాగిస్తున్నారు!

మరి ఈ ‘బహుజన రాజ్యం రావాలి’ అని చెప్పేవారు.. ఈ వర్గ చైతన్యాన్ని, వర్గ స్పృహను పరిగణనలోకి తీసుకోకుండా అందరినీ ఒకే గాటన కట్టి, బహుజనులు అని అనడం శాస్త్రీయమైన పిలుపేనా? ఈ విధానం శ్రామిక కులాల ప్రజలకు మేలు చేస్తుందా? మన బహుజనులు ముఖ్యమంత్రులు కావాలి! మన బహుజనులు ప్రధాన మంత్రులు కావాలి! అదే మా లక్ష్యం, అదే మా ధ్యేయం అంటున్నారు! మరి ఈ లెక్కన ఇప్పటికే అనేక మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు అయ్యారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి మోడీ, రాష్ట్రపతి ద్రౌపది కూడా బహుజనులే! మరి ఇంతమంది మంత్రులు బహుజనులే అయినప్పుడు, బహుజనుల బతుకులు ఎందుకు మారడం లేదు? ఎక్కడ పొరపాటు జరిగుతుంది అనీ మన బహజన మిత్రులు ఎందుకు ఆలోచించరు?

శరీరంలో రక్తం ఉంటేనే.. ఆ శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా పని చేస్తుంది! అట్లాగే, ప్రజల మేలు కోరే ఏ సిద్ధాంతంలో అయినా దోపిడీ వర్గాలను నిర్మూలించే వర్గ దృక్పథం లేకుంటే.. ఆ సిద్ధాంతం అంతిమంగా ఆ దోపిడీ వర్గాలకే మేలు చేస్తుంది! వర్గ స్పృహను పరిగణనలోకి తీసుకోకపోవడమంటే.. బహుజనులుగా పిలువబడుతున్న శ్రామిక ప్రజల్లో.. దోపిడీ వర్గాలు పుట్టడానికి, అవి బలపడడానికి, సిద్ధాంతపరంగానే ఆమోదించినట్లు అవుతుంది! అందుకే బహుజనులు అని సంబోధించిడానికి కొంతవరకు బాగానే ఉన్నా.. వర్గ స్పృహ లేని ‘బహుజన రాజ్యం’ అనే పిలుపు పూర్తిగా ఆక్షేపణీయమే! ‘బహుజన పార్టీ’ పేరులో, ‘బహుజన రాజ్యం’ పిలుపులో, ‘బహుజన సిద్ధాంతం’లో వర్గ స్పృహ లేదు! అంటే, వీళ్ళు చెప్తున్న ‘బహుజన రాజ్యాధికారం’ సాధించడానికి కూడా వీరికి ఒక శాస్త్రీయమైన లక్ష్యం లేదు అని అర్థం! అలాంటప్పుడు ఈ అంబేడ్కర్ భావజాల పార్టీలు, వారి ప్రయాణాలు.. గమ్యం చేర లేవు, లక్ష్యం సాధించ లేవు! వర్గ స్పృహ కొరవడిన వీరి విధానాల ఫలితాలన్నీ.. అంతిమంగా దోపిడీ వర్గాలకు, మనువాదులకే ఉపయోగపడతాయి!

ఇక ఈ బహజన పార్టీలకు మార్గనిర్దేశం చేసేది అంబేడ్కర్ ఆలోచనా విధానం! అయితే, అంబేడ్కర్ సూచించిన మార్గంలో కుల నిర్మూలన, సమాజ విముక్తి సాధ్యమవుతుందా.. అంటే, సాధ్యం కాదు అనీ, డ్బ్బై ఐదేళ్ల భారతదేశ స్వాతంత్య్ర పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి! ప్రజల చైతన్యం ప్రగతిశీలంగా ఎదిగినప్పుడే రాజ్యాంగం ద్వారా ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుంది. ఏ దేశంలో అయినా రాజ్యాంగం.. ఆ రాజ్యం (దేశం) లోని కులాలను, మతాలను, వర్గాలను బలోపేతం చేస్తుంది లేదా తటస్థంగా ఉంచుతుంది. రాజ్యాంగం వల్ల శ్రామిక ప్రజలకు మేలు జరుగుతున్నట్లు బయటికి కనిపించినా.. అంతిమంగా అది పాలక వర్గాలకు, దోపిడీ వర్గాల ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడుతుంది!

ఈ నేపథ్యంలో, ఈ భూస్వామ్య, పెట్టుబడీదారీ (డబ్బు) సంస్కృతి.. అణగారిన ప్రజల చైతన్యానికి, వారి మనుగడకు, వారి ఐక్యతకు అత్యంత అవరోధంగా మారిన తర్వాత.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అనేది.. ‘సంపన్నులకే తప్ప, శ్రామిక కులాల ప్రజలకు సాధ్యం కాదు’ అనీ అందరికీ తెలిసిపోయింది! బహుజనులకు రాజ్యాధికారం దక్కడానికి.. ఈ భూస్వామ్య, పెట్టుబడిదారీ సంస్కృతి ఎంత అవరోధంగా ఉందో, అర్థం చేసుకోకుండా.. దాన్ని అధిగమించకుండా ఎన్నికల్లో గెలుపు ఎట్లా సాధ్యమవుతుంది? సమాజ విముక్తి ఎట్లా జరుగుతుంది? ఈ అవరోధాల్ని అధిగమించాలంటే.. శ్రామిక ప్రజల్లో ఉన్న కుల చైతన్యం వర్గ చైతన్యంగా మారాలి! అది వర్గ పోరాటాల ద్వారానే వస్తుంది! ప్రజల్లో వర్గ స్పృహ, వర్గ చైతన్యం పెంపొందడం వల్ల.. భవిష్యత్తులో సోషలిస్టు వ్యవస్థ సాకారం అవ్వడమే కాకుండా అంతకు ముందుగా ఉన్న ఈ పార్లమెంటరీ వ్యవస్థ కూడా ప్రజలకు ఇప్పటి కంటే బాగానే ఉపయోగపడుతుంది!

ఓటు హక్కు కూడా సద్వినియోగం అవుతుంది! అందుకే, అంబేడ్కరిజం పేరుతో, బహుజన పార్టీల పేరుతో, లాల్ – నీల్ మైత్రి పేరుతో, ఇంకా రకరకాల పేర్లతో.. కమ్యూనిస్టు భావజాలం మీద జరుగుతున్న దాడులను ఆపెయ్యాలి! మార్క్సిజాన్ని బలహీన పరచడం; శ్రామిక వర్గ ప్రజల్లో ‘వర్గ దృక్పథాన్ని’ నీరుగార్చి వారిలో కులతత్వాన్ని పెంచడం వంటి చర్యలు శ్రామిక ప్రజలకు ద్రోహం చెయ్యడమే అవుతుంది అని గుర్తించాలి! ముఖ్యంగా కమ్యూనిస్టులు మనవాళ్ళు, మన అభ్యున్నతి కోరే వాళ్ళు అని, క్యాడర్‌కు చెప్పాలి! సామాజిక సమస్యల పరిష్కారం కోసం కలిసి ఉద్యమించాలి! ‘మార్క్సిజం ఒక ప్రాపంచిక దృక్పథంగా’ భావించే కమ్యూనిస్టులకు.. అంబేడ్కర్, ఫూలే వంటి సామాజిక ఉద్యమకారుల పట్ల, దేశంలోని సామాజిక ఉద్యమాల గౌరవభావం ఉంది అని గుర్తించాలి! అందుకే బహుజనులుగా పిలవబడుతున్న శ్రామిక కులాల ప్రజలారా, మేధావులారా! దోపిడీ వర్గాన్ని గుర్తించని ‘బహుజన రాజ్యం’ కాదు మనకు కావాల్సింది! దోపిడీ వర్గాన్ని లేకుండా చేసే శ్రామికవర్గ దృక్పథం కలిగిన ‘శ్రామిక ప్రజల రాజ్యం’ కావాలి!

సుభాష్
9000904284

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News