- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటర్లకు ఆధార్ కార్డు అనుసంధానం ’తప్పనిసరి’ కాదనే నిబంధన ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ వివరాలను ఇవ్వాలనే కాజ్ పెట్టడంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంజన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృ త్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారించింది.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫున హాజరైన న్యాయవాదులు సుకుమార్ పత్ జోషి, అమిత్ కుమార్ వాదిస్తూ… ఓటర్ల జాబితాకు ఆధార్ వివరాలను అనుసంధానం చేయడం తప్పనిసరి కాదని, కానీ ఫామ్ 6, 6బిలో ఓటర్లు వాటిని పొందుపర్చాలంటూ ఉన్నాయని అంగీకరించారు. ఆధార్ కార్డు వివరాలను అందజేయడంపై ఓటర్లు టిక్ చేయాల్సి ఉన్నదని, నిబంధనలనూ మారుస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -