సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ’రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది.
Also read: హయ్యస్ట్ వ్యూస్ లో శ్రీమంతుడు
సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. రూల్స్ రంజన్… పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ట్రైలర్. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే ట్రైలర్‌లో విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఈనెల 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.