Monday, December 23, 2024

నల్లమలలో ఆ నిబంధనలు ఎత్తివేయాలి…

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/ నాగర్ కర్నూల్: నల్లమల అడవిలో ఫారెస్ట్ నిబంధనల పేరుతో దారి దోపిడి జరుగుతుందని యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల అడవిలో ప్రతి సంవత్సరం జరిగే లోతట్టు ప్రాంతంలో వెలసిన సలేశ్వరం జాతరపై రాష్ట్ర ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు పెట్టిన నియమనిబంధనలు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా భక్తులు సలేశ్వరం జాతరకు ఇతర రాష్ట్రాల నుండి వస్తారని అన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఫారెస్ట్ అధికారులు పెట్టిన నిబంధనలను ఎత్తివేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News