అమరావతి: గత ప్రభుత్వంలో గోశాలలో నాచు పట్టేసిన నీళ్లను గోవులకు పట్టించారని టిటిడి ఈవో శ్యామలరావు ఆరోపణలు చేశారు. గోవులు తాగే నీళ్లు నాచు పట్టేసినా పట్టించుకోలేదని అన్నారు. తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై టిటిడి ఈవో మీడియా సమావేశం జరిపారు. పురుగులు పట్టేసి.. వినియోగించుకోలేని నీళ్లు గోవులకు పట్టిస్తారా?అని ప్రశ్నించారు. విజిలెన్స్ వాళ్లు వెళ్లేందుకు కూడా గతంలో అనుమతించని పరిస్థితి నెలకొందని చెప్పారు. హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంపై చాలా జాగ్రత్తగా ఉండాలి కదా!అని అన్నారు. గోశాల ఆవరణలో చెల్లా చెదురుగా మెడిసిన్స్ పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 2024లో ఈవోగా బాధ్యతలు తీసుకునే ముందు సిఎం చంద్రబాబును కలిశానని తెలియజేశారు. టిటిడిలో వ్యవస్థలు పాడయ్యాయని..వాటిని సరిచేయాలని సిఎం చెప్పారని తెలిపారు. పదినెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరిచామని వెల్లడించారు. టిటిడి ఐటీ విభాగంలో ఉన్నత స్థాయి అధికారి నియామకంలో నిబంధన గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. జిఎం స్థాయి అధికారి నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఐటి విభాగం వైఫల్యంతో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక దళారి 50 సార్లు ఆర్జిత సేవలు టికెట్ పొందారని పేర్కొన్నారు. ఆవు నెయ్యి కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. వైసిపి గవర్నమెంట్