Thursday, December 19, 2024

గోదాం ఏర్పాటులో నిబంధనలు పాటించలేదు

- Advertisement -
- Advertisement -

Rules were not followed in setting up warehouse

గ్యాస్ సిలిండర్లు పేలాయని డయల్ 100కు ఫోన్
గోదాం యజమానిని అరెస్టు చేశాం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిపి సివి ఆనంద్

హైదరాబాద్ : బోయిగూడ టింబర్ డిపో సంఘటనలో యజమానులు నిబంధనలు పాటించలేదని, ప్రమాద నివారణ చర్యలు తీసుకోలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. సికింద్రాబాద్‌లోని బోయిగూడలోని టింబర్ డిపోలో బుధవారం అగ్నిప్రమాదంపై మాట్లాడారు. కార్మికులంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరిగినట్లు తెసిందన్నారు. గ్యాస్ సిలిండర్లు పేలినట్లు డయల్ 100కు ఫోన్ వచ్చిందని తెలిపారు. సిలిండర్లు పేలడంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయని తెలిపారు. కింది ఫ్లోర్‌లో తక్కు సామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని తెలిపారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. గోదాం యజమానిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News