Monday, December 23, 2024

భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించలేం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిల భావప్రకటన పై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టిబాధ్యత సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వాని కి ఆపాదించలేమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 19 (2) అధికరణం కింద నిర్దేశించినవి మినహా వారి భావప్రకటన స్వేచ్ఛపై ఎటువంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కొన్నేళ్ల క్రిందట జరిగిన ఓ సామూహిక అత్యాచారం కే సుపై అప్పట్లో ఆ రాష్ట్రమంత్రి చేసిన వివాదాస్ప ద వ్యాఖ్యలపై దాఖలయిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం 41 మెజారిటీతో ఈ తీర్పు వెల్లడించింది. పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమ ని పేర్కొంటూ జస్టిస్ ఎస్‌ఎ నజీర్ నేతృత్వంలో ని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వెల్లడించింది.

ధర్మాసనంలో న్యాయమూర్తులు బి ఆర్ గవాయ్, ఎఎస్ బొపన్న, వి రామసుబ్రహ్మ ణ్యం కూడా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే జస్టిస్ బివి నాగరత్నమాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. నే తల విద్వేషపూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమని, ఈ సమస్యకు పార్లమెంటు పరిష్కారం చూపాలని ఆమె పేర్కొన్నారు. నేత లు చేసే విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ,సమానత్వాన్ని దె బ్బతీస్తాయని .. సమాజంలోని ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావప్రకటన స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న వారికి స్వయంగా విధించుకునే ప్రవర్తనా నియమావళి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ మంత్రి అభిప్రాయాలు ప్రభుత్వ వైఖరిని, అభిప్రాయాలను ప్రతిబింబిస్తే ప్రభుత్వంపై సమష్టి, ప్రత్యామ్నాయ బాధ్యతను మోపవచ్చన్నారు. వాక్‌స్వాతంత్య్రంపై అదనపు ఆఆంక్షలను తీసుకు రావలసిన బాధ్యత పార్లమెంటుదేనని అన్నారు.

రాజకీయ పార్టీలు తమ సభ్యులు ప్రసంగించడానికి తగిన నియమావళిని రూపొందించడంపై ఆయా పార్టీలే పరిశీలించాలని జస్టిస్ నాగరత్న తన తీర్పులో స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 2016 జులై నెలలో ఓ సామూహిక అత్యాచారం కేసు నమోదయింది. తన భార్య, కుమార్తెపై జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన కేసును ఢిల్లీకి బదిలీ చేయా లంటూ యుపికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ ఘటనను ‘ రాజకీయ కుట్ర’గా పేర్కొంటూ అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. అందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తొలుత దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ..2017 అక్టోబర్‌లో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. గత నవంబర్ 15న ఈ కేసు విచారణను పూర్తి చేసిన జస్టిస్ ఎస్‌ఎ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News