Sunday, April 13, 2025

శ్రీలీలతో డేటింగ్ లేదట!

- Advertisement -
- Advertisement -

తొలి హిందీ సినిమాకే హీరోయిన్ శ్రీలీలపై చాలా పుకార్లు వచ్చాయి. బాలీవుడ్ క్యాసనోవాగా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటిస్తోంది ఈ బ్యూటీ. అందుకే ఇన్ని డేటింగ్ రూమర్స్. ప్రస్తుతం వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లకు మరింత ఊతమిస్తూ, తమ ఇంటికి ఓ డాక్టర్ కోడలిగా వస్తే బాగుంటుందంటూ ఈమధ్య కార్తీక్ ఆర్యన్ తల్లి స్పందించడం విశేషం. మొత్తానికి ఈ అంశంపై కార్తీక్ ఆర్యన్ స్పందించాడు. శ్రీలలతో డేటింగ్ అంటూ వినిపిస్తున్న ప్రచారాన్ని ఖండించాడు. తను సింగిల్ అని ప్రకటించాడు. ఇండస్ట్రీలో తనకు ఎవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరని అంటున్నాడు కార్తీక్ ఆర్యన్. మొత్తానికి శ్రీలీలతో డేటింగ్ రూమర్స్‌ను ఖండించాడు ఈ హీరో.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News