- Advertisement -
హైదరాబాద్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన నగరంలోని ఖైరతాబాద్ జంక్షన్లో బుధవారం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపి అందరినీ బయటకు దించాడు. కారులో ఉన్న అందరూ క్షేమంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న మంటలను అదుపు చేసింది. కారు ఇంజిన్లో విద్యుత్ షాక్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించారు.
Running Car caught fire at Khairatabad
- Advertisement -