వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పత్రాలపై సంతకం చేశారు. ప్రజల బలంతో తాను చేసే ప్రచారం నవంబర్‌లో గెలిపిస్తుందని కమల హామీ ఇచ్చారు. నవంబర్‌లో ప్రజల బలంతో కూడిన ప్రచారంతో గెలుస్తానని కమలా హ్యారిస్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ధీమా వ్యక్తం చేశారు. ప్రతి వోటు సంపాదించేందుకు తాను బాగా కష్టపడతానని కూడా ఆమె ఉద్ఘాటించారు.
‘అమెరికా అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పత్రాలపై సంతకం చేశాను. ప్రతి వోటు సాధించేందుకు బాగా శ్రమిస్తాను. నవంబర్‌లో ప్రజల శక్తితో కూడిన మా ప్రచారం గెలుస్తుంది’ అని కమలా హ్యారిస్ తన పోస్ట్‌లో తెలిపారు. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆమె అభ్యర్థిత్వాన్ని జో బైడెన్ ఆమోదించారు.