Thursday, January 23, 2025

రూపాయి @ 80.05

- Advertisement -
- Advertisement -

Rupee falls to 80 level against US dollar

చరిత్రలోనే తొలిసారి డాలర్‌పై అత్యంత కనిష్టానికి విలువ
నియంత్రణ చర్యలు చేపట్టిన ఆర్‌బిఐ

ముంబై : చరిత్రలోనే తొలిసారి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80 దాటి పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 80 స్థాయికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్‌లో రూపాయి 79.91 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 80.05కి క్షీణించింది. ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) జోక్యం చేసుకున్న తర్వాత మంగళవారం రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 80.05 నుంచి కోలుకుని 79.92 వద్ద ముగిసింది. రూపాయి విలువ పతనానికి అడ్డుకునేందుకు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) చర్యలు చేపట్టింది. 100 బిలియన్ డాలర్ల వరకు వినియోగించేందుకు రిజర్వు బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఆగని పతనం

రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 80 స్థాయికి పడిపోయింది. రూపాయి బలహీనపడటం వల్ల విదేశాల్లో చదువుకోవడం, అక్కడికి వెళ్లడం ఖరీదైనదిగా మారనుంది. ఇది కాకుండా రానున్న రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 80 శాతం దిగుమతి చేసుకుంటోంది, దీనికి గాను పెద్ద మొత్తంలో డాలర్లలో చెల్లింపులు చేస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడితే మరిన్ని రూపాయిలు వెచ్చించాల్సి వస్తోంది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై కనిపించనుంది. రవాణా మరింత భారమై వస్తువుల ధరలు పెరగొచ్చు. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుంది.

యుఎస్‌లో ప్రయాణం, చదువు ఖరీదు

రూపాయి పతనం వల్ల అమెరికాలో ప్రయాణం, చదువు ఖరీదుగా మారనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 75 వద్ద ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు విద్యార్థులు 80 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా ఫీజుల నుండి జీవనం, ఆహారం, ఇతర వస్తువుల వరకు ఖరీదైనవిగా మారతాయి.

కరెన్సీ విలువ ఎలా నిర్ణయిస్తారు?

డాలర్‌తో పోల్చితే ఏదైనా ఇతర కరెన్సీ విలువ తగ్గితే దానిని కరెన్సీ పడిపోవడం బలహీనపడిందని అంటారు. ప్రతి దేశం అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించేందుకు విదేశీ కరెన్సీ నిల్వను కలిగి ఉంటుంది. విదేశీ నిల్వల తగ్గుదల, పెరుగుదల ప్రభావం కరెన్సీ ధరపై ప్రతిబింబిస్తాయి. భారత విదేశీ నిల్వల్లో డాలర్, అలాగే అమెరికా రూపాయి నిల్వలతో సమానంగా ఉంటే రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. భారత్ దగ్గర డాలర్ నిల్వలు తగ్గితే రూపాయి బలహీనపడుతుంది, పెరిగితే రూపాయి బలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News