Monday, December 23, 2024

రూపాయి విలువ క్షీణతపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

Nirmala Sitaraman

పూణే: ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్‌తో రూపాయి చాలా స్థిరంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. అమెరికా డాలర్‌తో ఇతర కరెన్సీలను కలుపుకుని పోలిస్తే రూపాయి చాలా బాగా స్థిరంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. రిజర్వ్ బ్యాంక్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిణామాలపై చాలా నిశితంగా గమనిస్తున్నాయని, దేశీయ కరెన్సీ గ్రీన్‌బ్యాక్‌(డాలర్)కు వ్యతిరేకంగా జీవితకాల కనిష్టానికి పడిపోయిన తర్వాత ఆర్థిక మంత్రి విలేకరులతో ఈ విషయం చెప్పారు.

“ఏదైనా ఒక కరెన్సీ దాని స్వంత కరెన్సీని కలిగి ఉండి, ఇతర కరెన్సీల వలె హెచ్చుతగ్గులు లేదా అస్థిరతకు గురికాకుండా ఉందంటే అది భారత రూపాయి. మేము చాలా బాగా స్థిరంగా ఉన్నాము ”అని ఆమె తన మూడు రోజుల ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌కు బలమైన కోటగా ఉన్న పూణే జిల్లాలో తన మూడు రోజుల పర్యటన చివరి రోజున  విలేకరులతో అన్నారు.

అమెరికా డాలర్‌తో శుక్రవారం నాడు రూపాయి 30 పైసలు క్షీణించి 81.09 వద్ద తాజా జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. విదేశాలలో బలమైన అమెరికన్ కరెన్సీ, పెట్టుబడిదారులలో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కారణంగా రూపాయి విలువ పతనమైంది. కాగా రూపాయి విలువని రక్షించుకోవడానికి ఆర్‌బిఐ డాలర్ నిల్వలను వెచ్చిస్తోంది, ఈ క్రమంలో  బిలియన్ల డాలర్ల కరెన్సీ ఆస్తులు(నిల్వలు) తరిగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News