Wednesday, January 22, 2025

రికార్డు స్థాయి కనిష్టానికి రూపాయి

- Advertisement -
- Advertisement -

డాలర్‌తో పోలిస్తే 83.27కు పడిపోయిన భారత్ కరెన్సీ
ముంబై : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. శుక్రవారంతో పోలిస్తే రూపాయి 9 పైసలు పడిపోయి 83.27కి క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బిఐ డాలర్లను విక్రయించడం వల్ల రూపాయి బలహీనపడుతోందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ హరిప్రసాద్ మాట్లాడుతూ, కీలక మద్దతు స్థాయి 83.1 దాటిన తర్వాత రూపీ గరిష్ఠ స్థాయికి పతనమైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం పెరగడం, డాలర్ బలం పెరుగుతుండడమే రూపాయి పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి 83.09 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో అది డాలర్‌కు 83.09 నుండి 83.30 రేంజ్‌లో కొనసాగింది. అయితే చివరకు డాలర్‌కు 83.27 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి డాలర్‌తో పోలిస్తే 83.16 వద్ద ముగిసింది. శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగస్టులో భారతదేశ ఎగుమతులు 6.86 శాతం క్షీణించి 34.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, అయితే గత ఏడాది ఇదే నెలలో ఇది 37.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు కూడా 5.23 శాతం క్షీణించి 58.64 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News