Monday, December 23, 2024

రూపాయే

- Advertisement -
- Advertisement -

మరింత పతనమైన రూపాయి
డాలర్‌కు రూ.83.13కు పడిపోయిన భారత కరెన్సీ
డాలర్ బలపడడం, ముడి చమురు ధరల పెరుగుదలే కారణం

రూపాయి క్షీణత కొనసాగవచ్చు : నిపుణులు

ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి విలు వ రోజు రోజుకీ క్షీణిస్తోంది. గురువారం నా డు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 9 పైసలు పడిపోయింది. దీంతో రూపాయి విలువ 83.22 కు పతనమైంది. బుధవారం ఇది 83.13 వద్ద ఉంది. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి జీ వితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ వారం రూపాయి మారకం విలువ వరుసగా నాలుగో రోజు తగ్గింది. అమెరికన్ కరెన్సీ డాలర్ బలపడటంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి పతనం అవుతోంది.
మరింత బలహీనపడే అవకాశం
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్‌లో గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.12 వద్ద ప్రారంభమైంది. ఆఖరికి 10 పై సల నష్టంతో రూ.83.22 వద్ద ముగిసింది. గత ఏడాది 2022 అక్టోబర్‌లో రూపాయి 83.29 స్థాయికి పడిపోయినప్పటికీ మొదటిసారిగా భారత్ కరెన్సీ ఈ స్థాయిలో ముగిసింది. కరెన్సీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టాక్ మార్కెట్ పెరుగుదల రూపాయి భారీ పతనాన్ని నిరోధించింది, లేకుంటే రూపాయి మరింత భారీగా పతనం అయ్యేది. అయితే బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్‌లో రూ.3245.86 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డాలర్ బలంగా ఉండటం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి క్షీణత ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
పెట్రోల్ ధరల తగ్గింపు ఆశలు ఆవిరి..
దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల ధరలు తగ్గిన త ర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధర లు తగ్గించవచ్చని నివేదికలు వచ్చాయి. ప్ర స్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ రల పెరుగుదల కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇబ్బందిగా మారింది. దీంతో ఇంధన ధ రల తగ్గింపు ఆశలు అడియాసలు కానున్నా యి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ చమురు కంపెనీలు తగ్గిం పు ధరలతో విక్రయిస్తే నష్టాలు ఎదుర్కోవా ల్సి వస్తుంది. మునుపటిలాగా లాభం ఉండే అవకాశ లేనందున తగ్గింపు నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి అంత సులభం కాదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News