కాసిపేటః కాసిపేట మండలంలోని గిరిజన గ్రామాలలో ప్రజలు విష జ్వరాలు సోకి విలవిల లాడిపోతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాలలో వైరల్ జ్వరాలు విజృంభిస్తుండడంతో గ్రామాలు మంచం పట్టాయి. గ్రామాల్లో ప్రతి ఇంటిలో జ్వరాలు తాండవిస్తున్నాయి. ఇప్పటికే సోనాపూర్ పంచాయితీలోని దొడ్డిగూడెం గ్రామంలో జలపతి అనే బాలుడు మృతి చెందాడు. అలాగే దేవాపూర్ ప్రసన్నంజానేయ నగర్‌లో చునార్కర్ గణేష్ కూడా విష జ్వరం సోకి మృతి చెందాడు. గణేష్ అనారోగ్యానికి గురి కాగా ప్రయివేటు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించినప్పటికి వేలాది రుపాయలు ఖర్చు అయ్యాయే తప్పా గణేష్ బ్రతక లేదని అతని తల్లిదండ్రులు దుఃఖిచారు. కొన్ని రోజులుగా గణేష్ కు మంచిర్యాల లోని ప్రయివేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందజేసినప్పటికి విష జ్వరంతో మృతి చెందాడని వారు దుఃఖించారు. ప్రస్తుతం ఇంకా పలు గ్రామాలలో విష జ్వరాల బారిన ప్రజలు ఉన్నారు.
విష జ్వరాలతో విల విలలాడుతున్న గ్రామాలు..
- Advertisement -
- Advertisement -
- Advertisement -