Monday, December 23, 2024

పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశా నికే ఆదర్శమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా గురువారం కేటిదొడ్డి మండల కేంద్రంలో నిర్వహి ంచిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. కేటిదొడ్డి సర్పంచ్ పావని జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞ ంలా సాగి, గ్రామ రూపురేఖల్ని మార్చివేసిందన్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, చెత్తసేకరణకు ట్రాక్ట ర్, ట్రాలీ, హరితహారం కోసం ట్యాంకర్, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, డంప్‌యార్డులు, నర్సరీ లు, పల్లెప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో పల్లెలు శోభాయమానంగా మారాయన్నారు. గ్రామాలే దేశానికే పట్టుగొమ్మలని అని అభివృద్ధి చెందితనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మె ల్యే తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సిబ్బందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన వస్త్రాలను, ప్రశంసా పత్రాలను అందేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనో రమ్మ, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపిపిలు రామకృష్ణనాయుడు, సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ, గ్రామప ంచాయతీ కార్యదర్శి, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News