Friday, November 15, 2024

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ రూరల్ : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూరు రూ.20 లక్షలు, లచ్చ నాయక్ తండాలో రూ.20 లక్షల నిధుల వ్య యంతో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన లక్షంగా సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పల్లె ప్రగతి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుదని భావించి పల్లెలను అభివృద్ధి దిశగా ప్రయాణించేందుకు కృషి చేస్తున్నారన్నారు. సర్వతోముఖాభివృద్ధి లక్షం గా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు…
కొల్లాపూర్ మండల పరిధిలోని అంకిరావుపల్లి గ్రామంలో నిచ్చెనకొండపై వెలిసిన వేణుగోపాల స్వామి, సత్యనారాయణ స్వామిని బుధవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి దర్శించుకు ని పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గ్రామ నుంచి నిచ్చెన కొండ వేణుగోపాల స్వామి గుడి వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా పనులు జరుగుతున్నాయని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

పురాతనమైన ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ రోడ్డు మంజూరు చేశామని, పనులు జరుగుతున్నాయని, అక్కడ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News