జాతీయ పంచాయతీ అవార్డుల్లో ప్రతిభ కనబర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఇందుకు చొరవ చూపిన ప్రజాప్రతినిధులను అభినందించారు. సోమవా రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ పురస్కరించుకొని అవార్డుల ప్రదానం జరిగిం ది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 అవార్డుల్లో రాష్ట్రానికి చెందిన గ్రామాలు 13 అవార్డులను గెలుచుకున్నా యి. 8 దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, ఐదు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను ఆయా గ్రామా ల సర్పంచులు,
ఎంపిపిలు, జడ్‌పి చైర్‌పర్సన్లతో కలిసి మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు రాష్ట్రపతి అందజేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ గ్రామాల అభివృద్ధే దేశ సమగ్ర ప్రగతికి దారితీస్తుందన్నారు. దశాబ్దాలుగా పట్టణీకరణ వేగంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ అత్యధిక జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారని అన్నారు. నగరాల్లో నివసించే వా రు కూడా గ్రామాలకు అనుసంధానమై ఉంటారు. గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను అమ లు చేసే సాధనం మాత్రమే కాదని, కొత్త నాయకులు, ప్రణాళికలు రూపొందించేవారు, విధాన రూపకర్తలు, ఆవిష్కర్తలను ప్రోత్సహించే వేదిక అని ఆమె గుర్తుచేశా రు.
ప్రతి ఐదేళ్లకోసారి తరువాయి పంచాయతీ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలనే నిబంధన ఉందని, సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం ఉండేలా చూడాలని రాష్ట్రపతి కోరారు. ఏ సమాజమైనా సమగ్రాభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. మహిళలు తమ కోసం, తమ కుటుంబాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉండాలన్నారు. గ్రామీణ సంస్థలకు ఎన్నికైన 31.5 లక్షల మంది ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలే కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
* ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశంతోనే జాతీయ అవార్డులు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశంతోనే తెలంగాణ పల్లెలు సమగ్రాభివృద్ధి సాధించాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అవార్డుల ప్రదానం అనంతరం ఎంపి వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన తెలంగాణలో జరుగుతున్న పల్లె ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై వివరించారు. దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా నిధులు ఇస్తున్నదని చెప్పారు. పల్లెల్లో వినూత్న ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అవార్డులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంతో పాటు అవార్డులు వచ్చేందుకు కారణమైన సిఎం కెసిఆర్, మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సిఎం కెసిఆర్ ఆలోచనా పథంలో పని చేస్తూ.. దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపాలని, అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణను మరింత సమున్నతంగా తీర్చిదిద్దాలని గ్రామాల ప్రజాప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతకుముందు, అవార్డు గ్రహీతలకు ఇచ్చిన తే నీటి విందులో కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్రానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీతలు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.