Saturday, December 28, 2024

గ్రామాల స్వరూపాన్ని మార్చేసిన పల్లె ప్రగతి

- Advertisement -
- Advertisement -

నల్గొండరూరల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు అ భివృద్ధి చెంది, గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని నల్గొండ శా సనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణదశాబ్థి ఉత్సవాల సందర్భంగా నల్గొండ మండలం అనెపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ మేకల అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం తెలంగాణ పల్లె ప్రగతిదినోత్సవం లో ఏర్పాటుచేసిన గ్రామ సభలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామపంచాయతీ భవనం ఆవరణంతో గ్రామ సర్పంచ్ అరవింద్‌రెడ్డి, జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రంలో 12,746 గ్రా మ పంచాయతీలలో నల్గొండ నియోజకవర్గంలో 93 గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఏఎంఆర్‌పి ప్రాజెక్టు ద్వారా డి 25,37,39,40 కాలువల ద్వారా ఒక పంటకు ఊడా సరిగా నీరు రాని పరిస్థితి వు ండేది అన్నారు. ప్రస్తుతం పుష్కలంగా నీరు వుందని ఎండకాలంలో సైతం పానగల్ ఉదయ సముద్రం అలుగు పోస్తుందని అన్నారు. క రెంటు, నీరుతో పాటు ఎకరానికి 10 వేల రూపాయలు పెట్టుబడి సా యం అందిస్తున్నట్లు ఏర్ కారణంగా పంటలు ఉత్పత్తి పెరిగిందని అన్నారు. ఉత్పత్తి చేసిన ధాన్యం కేంద్రం కొనకుండా పేచీ పెట్టినా మ ద్దతు ధరకు ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వంకొని రైతులను ఆదుకొందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా లబ్ధి జరిగే పథకకాలతో పా టు గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించి, నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిందని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూపం మారిపోయాయని ఆయన తెలిపారు.
ప్రతి గ్రామంలోట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటుచేయడం వల్ల పా రిశుద్ధం మెరుగుపడిందని, ప్రతిరోజు చెత్తసేకరణ జరుగుతుందని, దీనివల్ల దోమలు,ఈగలు తగ్గిపోయి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. గతంలో పోలీస్తే పారిశుద్దం గ్రామాల్లో గణనీయం గా పెరిగిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, స్మశాన వా టిక, డంపింగ్‌యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేసుకుతన్న రాష్ట్ర తెలంగాణ మాత్రమేనని, దేశంలో మరే రాష్ట్రంలో గ్రామాలలో ఇలాంటి వసతులు లేవని తెలిపారు. బ్రాహ్మణ వెల్లలా ప్రాజెక్టు ట్రయల్ రన్ అయిందని, గ్రామం చెరువు నింపి పూర్తి ఆయకట్టు గ్రా మపంచాయతీ చెరువు నింపి పూర్తి ఆయకట్టు నీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ భవనం నిర్మాణంకు 300 గ జాల స్థలం ఇచ్చిన దాత జగదీశ్వర్‌రెడ్డిని ఎంఎల్‌ఏ సన్మానం చేశా రు. ఈస్థలంలో 16లక్షల రూపాయలతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం చేసుకొని ప్రారంభం చేసుకున్నట్లు తెలిపారు. గ్రా మంలో 90లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లను మంజూరు చేసి నిర్మించామని తెలిపారు.
నల్గొండ నియోజకవర్గానికి పట్టణంలో 1200 కోట్ల ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గ్రామాల్లో పట్టణంలో రోడ్లు, రహదారులు నిర్మాణం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం 500 జనాభాకు ఒక మల్టీపరపర్స్ వర్కర్స్‌ను నియమించి ప్రతి మాసం 9 వేల 500 వేతనాలు అందిస్తున్నామని ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, పాఠశాలలను శుభ్రం చేస్తున్నామని తెలిపారు. మల్టీపర్పస్ వర్కర్ల పా త్రను సఫాయి.. అన్న.. నీకు సలాం అన్న. సఫాయి అమ్మ… నీకు స లాం అమ్మ.. అని గుర్తించి వారిని సత్కరిస్తూ దుస్తులు, బూట్లు, టో పీలు, అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథులు పాఠశాల వి ద్యార్థులు ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్‌యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్థన్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు పీడి శైలజ, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News