Wednesday, January 22, 2025

కెసిఆర్ సర్కార్‌లోనే పల్లెల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కోహెడ : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలోనే రాష్ట్రంలోని పల్లెలు సమగ్రాభివృద్ధిని సాధించాయని కోహెడ ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మంత్రి హరీశ్ రావు మంజూరు చేసిన రూ. 10 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం పనులను ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… పల్లె ప్రగతి వంటి అద్భుత కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. యావత్ దేశానికే తెలంగాణ ప ల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సహకారంతో… మంత్రి హరీష్ రావు బస్వాపూర్ గ్రామాభివృద్ధికి రూ. 10 లక్షలు నిధులు మంజూరి చేసినట్లు పేర్కొన్నారు. వారిద్దరికి ఎంపిపి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ సత్తయ్య, వార్డు సభ్యులు బండి సంపత్, కేడిక కిష్టారెడ్డి, మాజీ ఎంపిటిసి కొక్కుల రమేష్, మాజీ ఉపసర్పంచ్ మాంకాల అంజయ్య, నాయకులు పెద్దొళ్ల శ్రీనివాస్, సిరిగాది బాలరాజు, ఎండి ఇక్బాల్, బూరుగుల శ్రీనివాస్, తాటిపాముల తిరుపతి, తాటిపాముల సుధీర్ గౌడ్, మాంకాల రమేష్, వికాస్ గౌడ్, శివరాత్రి శ్రీనివాస్, కొక్కుల గణేష్, మధు, నరేందర్, సాయిరాం, యాదగిరి, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News