Monday, December 23, 2024

కెసిఆర్ పాలనలో గ్రామీణ అభివృద్ధి: కొప్పుల

- Advertisement -
- Advertisement -

ధర్మారం: సిఎం కెసిఆర్ 9 ఏళ్ల పాలనలో గ్రామీణ అభివృద్ధి పరుగులు పెట్టిందని, పల్లె ప్రగతి సమూల మార్పులు తెచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరిగిందని, ప్రజలు అభివృద్దిని గుర్తించి, ప్రతిపక్షాలకు సరైన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా గురువారం బొట్లవనపర్తి గ్రామంలో పల్లె ప్రగతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్ పాల్గొన్నారు. సర్పంచ్ రెడపాక ప్రమీల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి ఈశ్వర్‌కు ఘన స్వాగతం పలికారు. బొట్లవనపర్తి శివారులోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ వైకుంఠదామాలను పరిశీలించి అద్భుతమైన పనితీరుకు గ్రామ సర్పంచ్ పాలకవర్గాన్ని అధికారులను అభినందించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన పథకాలు చేపట్టి దేశానికి మన రాష్ట్రం రోల్ మెడల్‌గా నిలిచిందన్నారు. ఇక్కడ ప్రవేశపెఇట్టన పథకాలు, అభివృద్ధిని చూసి పొరుగు రాష్ట్రాలు వచ్చి అబ్బురపడుతున్నాయని మంత్రి అన్నారు. ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా, విద్య, వైద్య, వ్యవసాయంలో తీసుకువచ్చిన మార్పులు ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు తెచ్చాయని అన్నారు. నేడు విద్యుత్ లోటులేని రాష్ట్రంగా, చివరి గుంటకు నీరందుతుందని కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు.

ప్రతి యేటా రూ.1500 కోట్ల ఇన్సురెన్స్ చేసి రైతు బీమా అందించడంతోపాటు రూ.6 వేల కోట్ల విద్యుత్ బకాయిల రద్దు, గ్రామీణ రోడ్ల నిర్మాణం జరిగాయని ఇవన్ని ప్రతిపక్షాలకు కనిపించడం లేదంటూ మంత్రి ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం తపిస్తూ అభివృద్ధి ప్రదాతగా అందరి గుండెల్లో నిలిచిన సీఎం కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బొట్లవనపర్తి గ్రామం మండలానికే ఆదర్శంగా నిలిచిందని సర్పంచ్ రెడపాక ప్రమీల శ్రీనివాస్, గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని, తమ ప్రజలను, ప్రజాప్రతినిధులను మంత్రి ఈశ్వర్ అభినందించారు. ఉత్తమ సేవలను అందించిన గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించి, ప్రశంస పత్రాలు అందించారు.
గోపాల్‌రావుపేట గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ
గోపాల్‌రావుపేటలో గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవానికి శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ జనగామ అంజయ్య చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు, ప్రతినిధులతో మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న గ్రామపంచాయతీ భవనాన్ని ఆదునీకరించి మహిళా సంఘాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు మంత్రిని సన్మానించి మీ వెంట నడుస్తామని సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News