Monday, December 23, 2024

గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి స్మశాన వాటికకు నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఇంకా జిల్లాలోని 41 స్మశాన వాటికల్లో కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.

గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు తిరుగుతూ ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్, మిషన్ భగీరథ కనెక్షన్, బోర్‌వెల్ అందుబాటులో ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే 98 గ్రామ పంచాయతీలలో నూతన భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఈ నెల 10 లోగా నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల ఫోటోలను తీసి అందించాలన్నారు.

హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్షాలను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 5 లక్షల మేర మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించి గుంతలు తవ్వకానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, 1.50 లక్షల గుంతలు త్వకం పూర్తి చేశామని అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులను పెంచి హరితహారం మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించాలన్నారు.

దీనిని ప్రత్యేకంగా ఎంపీడీఓలు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో లక్షం మేరకు మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం కింద జిల్లాకు 10,759 దరఖాస్తులను వచ్చాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేయాలని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది దరఖాస్తుదారులు, ఫీల్డ్ కు వెళ్లి వారి చేస్తున్న వివరాలను పరిశీలించాలని సూచించారు.

వివరాలను ఆన్‌లైన్‌లో ప్రదర్శించాలని తెలిపారు. అర్హులైన వారిని గుర్తించిన తర్వాత ప్రతి నెల 15న ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్హులకు లబ్ది చెక్కులు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు శ్రీధర్, చంద్రమౌళి, రంగారెడ్డితోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News