Monday, January 20, 2025

పండుగలా పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలను సదాశివనగర్ మండల సర్పంచ్లు, ఎంపిటిసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, ఫీస్డ్ అసిస్టెంట్‌లు, ఐకేపి వివోఏ లు, మహిళా సంఘాల సభ్యులు గ్రామస్థులు పల్లె ప్రగతి వేడుకల్లో పాల్గొని పండుగలా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. సఫాయి కార్మికులకు, జీపి సిబ్బందికి ఘనంగా సన్మానాలు చేసి ప్రసంశా పత్రాలను అందజేశారు. అనంతరం భారీ ర్యాలీగా తరలివెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో బాగంగా పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్, నర్సరీలు తదితర అభివృద్ధ్ది పనులు చూశారు.

అందరూ కలసి అల్పాహారం, భోజనాలు చేశారు. వజ్జాపల్లి లో సర్పంచ్ ఎర్రం నర్సయ్య, ఉప సర్పంచ్ ప్రభాకర్ రావు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మాధవి లత, పద్మాజివాడి లో సర్పంచ్ కవిత ఆనంద్, ఉప సర్పంచ్ రజియొద్దీన్, కార్యదర్శి గంగాధర్, భూంపల్లిలో సర్పంచ్ సంబు లలితాబాయి, వార్డు సభ్యులు, కార్యదర్శి నరెందర్, ఐకేపి సిసి రాములు, తుక్కోజివాడిలో సర్పంచ్ కడతల రాజమణి పీరయ్య, ఎంపిటిసీ జయక్ష రమేష్ రావు, ఉప సర్పంచ్ సంగారవు, కార్యదర్శి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ అద్యక్షుడు రాజు, తిమ్మోజివాడిలో సర్పంచ్ పొన్న స్వప్న శంకర్, ఉప సర్పంచ్ చాకలి రాజయ్య, కార్యదర్శి మమత, వార్డు సభ్యులు, బిఆర్‌ఎస్ అద్యక్షుడు పొన్న పెద్ద నర్సయ్య, లింగంపల్లిలో సర్పంచ్ గుండెల్లి సాయిలు, ఉప సర్పంచ్ దామోదర్ రావు, కార్యదర్శి స్వరూప వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News