Wednesday, January 22, 2025

పండుగలా పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -
  • గ్రామగ్రామాన ఆనందోత్సాహలు ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, ప్రజా ప్రతినిధులు
  • మొగుడంపల్లిలో సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారాయని, అన్ని విధాల పట్టణాలకు దీటుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మొగుడంపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామం శివారు నుంచి ఎడ్ల బండిపై ఊరేగింపుగా గ్రామ ప్రజలతో కలిసి గ్రామపంచాయతీలో గల నర్సరీని, పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడ బోర్డుపై నాడు- నేడు జరిగిన అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటోలు, ఆయా పనుల వివరాలు, ఖర్చు చేసిన నిధుల వివరాలను పరిశీలించారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామసభలో గత తొమ్మిది సంవత్సరాల కాలంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శి వివరిస్తూ ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేడుకలలో భాగంగా నేడు జిల్లాలోని 647 గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ వచ్చాక పల్లెల రూపురేఖలు మారాయన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని కలెక్టర్ పేర్కోన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించి, నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొందించిందని, పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం మారిపోయిందన్నారు.

అన్ని గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటు చేసామని, దాంతో పారిశుధ్యం మెరుగుపడి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారన్నారు. ప్రతి ఊరికి నర్సరీ, డంపింగ్ యార్డ్ , ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణాలు, పల్లె దవఖానాలు ఏర్పాటు చేసుకున్నామని, మిషన్ భగీరథ తో ప్రజలకు సురక్షిత తాగునీరు, పటిష్టమైన విద్యుత్ సరఫరా, ఎన్నెన్నో వసతులు ఏర్పడ్డాయని తెలిపారు. హరితహారంతో గ్రామాలు పచ్చదనంతో విలసిల్లుతున్నాయన్నారు. గతంలో ఉన్న గ్రామాల పరిస్థితిని, ప్రస్తుతం గ్రామాలలో ఉన్న వసతులను ప్రజలే బేరూజు వేసుకోవాలన్నారు. మొగుడంపల్లి మండలంకు వివిధ కేటగిరీలలో 14 పంచాయతీ అవార్డులు వచ్చాయంటే, అదే గ్రామాభివృద్ధికి నిదర్శనమన్నారు.

అవార్డు పొందిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలిపారు. గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపడేందుకు నిరంతరం కృషి చేస్తున్న సఫాయి కార్మికుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని సఫాయి కార్మికులకు డ్రెస్సులు, సబ్బు, నూనె , గ్లౌజులు మాస్కులు, శానిటైజర్ తదితర వస్తువులతో కూడిన కిట్ ను అందజేసి ,పూలదండ శాలువా ,సర్టిఫికెట్ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుగుణమ్మ, జడ్పిటిసి అరుణ మోహన్ రెడ్డి, ఎంపిపి ప్రియాంక, ఉప ఎంపిపి మక్సుద్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శి, ఎంపిఓ, ఎంపిడిఓ, తహశీల్దార్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News