Saturday, November 23, 2024

గ్రామ గ్రామాలలో పల్లె ప్రగతి ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : రాజంపేట్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయితీలలో గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. అయ గ్రామ పంచాయితీల ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న ఫలు సంక్షేమ పథకాలు గ్రామస్తులకు వివరించారు. నాడు పరిస్థితులు నేడు అభివృద్ధ్ది పథకాలు గూర్చి చర్చిస్తూ, గ్రామాలలో జరిగిన అభివృద్ధ్ది పనులు తెలియజేసే బ్రోచర్లు విడుదల చేశారు. గ్రామ పంచాయితీలలో పని చేసే సిబ్బందిని శాలువాలతో సన్మానించి వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బాలకిషన్, ఎంపిఓ రఘురాం, అయ గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు గ్రామ పంచాయితీ పాలక వర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలి :
ప్రభుత్వం చేపడుతున్న దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎంపిడిఓ వెలిశాల బాలకిషన్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. 17న గిరిజన ఉత్సవాలు, 18న మంచి నీళ్ళ పండగ, 19న హరితోత్సవం మెక్కలు నాటే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News