Wednesday, January 22, 2025

గ్రామ స్వరాజ్య స్థాపనకు పల్లె ప్రగతి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

సదాశివపేట: గ్రామ స్వరాజ్యం స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతితతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం సదాశివపేట మండల పరిథిలోని నాగులపల్లిలో 20లక్షల రుపాయలతో గ్రామ పంచాయితీ నూతన భవన నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఆఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు గత పాలకుల హయాంలో వెనకబడ్డాయని సిఎం కెసిఆర్ వచ్చిన తర్వాత ప్రజలకు మౌళిక వసతులు కల్పి ంచి గ్రామాల్లో అభివృద్ధి బలోపేతం చేశారన్నారు.

బిఆర్‌ఎస్ గ్రామాల్లో ఇంటింటికి మి షన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం గౌరవించుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. నాగులపల్లి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ నగేష్, ఎంపిపి యాదమ్మ, ఉప సర్పంచ్ నర్సింలు, ఎంపిటిసి రవి, డిఇఓ వెంకటేశ్వర్లు, పిఆర్‌డిఇఇ దీపక్, ఎంపిడిఓ పూజ, సొసైటీ చైర్మెన్ రత్నాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ఆరీఫోద్దీన్, అంజయ్య, నర్సింలు, స్వామిలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News