Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌తోనే పల్లెలు ప్రగతి బాట

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని రుద్రారం సిద్ది వినాయక ఆలయంలో చెట్లు నాటారు. అనంతరం సిఎం కెసిఆర్ చిత్రపాటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు.గత ప్రభుత్వ హయాంలో ప్రజలు సమస్యలతో తల్లడిల్లేవారన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతిలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.

ప్రతి గ్రామంలో సిసి రోడ్లు అంతర్గత మురుగు కాల్వలు, వైకుఠదామాలు , నర్సరీలు, క్రీడా మైదానాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. గ్రామ పంచాయతీల భలోపెతానికి పెద్దఎత్తున నిధులు అందజేస్తున్నట్టుగా చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామలకు జివిఆర్ ఎంటర్ ప్రైజెస్ సౌజన్యంతో ట్రాక్టర్లు అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సుష్మశ్రీ వేణుగాపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, అధికారులు , నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News