Monday, December 23, 2024

ఎన్నికల పండగకు రండి !

- Advertisement -
- Advertisement -

పట్నవాసులకు పల్లె ఓటర్ల ఆహ్వానం !
పల్లెల నుంచి పట్టణానికి ఆహ్వానం !!
గ్రూప్ కాల్స్‌తో ఓట్లను అభ్యర్థిస్తున్న నాయకులు !!!

మన తెలంగాణ / హైదరాబాద్: అన్నా నమస్తే..ఎక్కడున్నవే… 30వ తేదీ గుర్తుందా.. ఓట్ల పండగకొస్తున్నావా?.. మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మనోడికే గుద్దాల !. అంటూ పల్లెల నుంచి పట్టణవాసులకు స్థానిక నాయకులు గ్రూప్ కాల్స్‌లో ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా అందరూ రావాలే, వదినను కూడా తీసుకుని రండ్రి. అందరూ మనపార్టీకే ఓటు వేయాలే. మనోళ్లను గెలిపించుకోవాలే. ఎంత పని ఉన్నా కొంచెం పక్కనపెట్టుకుని ముందే రావాలే. రానుపోను ఖర్చులు మేమే భరిస్తాం. అవసరమైతే ముందుగాలనే పేమెంట్ కొడతాం.. ఇంతకీ.. నీది ఫోన్పేనా..? గూగుల్ పేనా? అన్నా..’ అంటూ.. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లను సంప్రదిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో  సుమారు 1.20 కోట్లు జనాభా ఉండగా,  అందులో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు 30 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. విద్యా, ఉద్యోగ రీత్యా పట్టణాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా కావడంతో.. పార్టీలకు ప్రతి ఓటు ఎంతో కీలకంగా మారింది.ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. ఒక్కో సందర్భంలో ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు.. ఓడిన ఉద్దండులూ ఉన్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతీ ఓటరును అభ్యర్థులు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం పొద్దున నిద్ర లేవగానే అందరి ‘టచ్’లోకి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు కొద్దిరోజులుగా కష్టపడుతున్నారు.

వలస ఓటర్లు, కుల సమీకరణ, మహిళలు, పురుషులు, సంఘాలు.. స్నేహబంధాలు.. బంధుత్వాలు.. ఇలా ప్రతీ ఒక్కరిని పలుకరించి తమ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను ఏదోఒక సమయంలో నేరుగా కలుస్తూ.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని ఫోన్లో సంప్రదిస్తున్నారు.ఎన్నికల సందర్భంగా వారు స్వ స్థలానికి వచ్చి ఓటు వేస్తారో… వేయరో అన్న భయం నేతల్లో నెలకొంది. ఈ క్రమంలో తమ కార్యకర్తల ద్వారా వారికి టచ్లోకి వెళ్తున్నారు.

ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. ఒక్కో సందర్భంలో ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు.. ఓడిన ఉద్దండులూ ఉన్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతీ ఓటరును అభ్యర్థులు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం పొద్దున నిద్ర లేవగానే అందరి ’టచ్’లోకి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు కొద్దిరోజులుగా కష్టపడుతున్నారు. వలస ఓటర్లు, కుల సమీకరణ, మహిళలు, పురుషులు, సంఘాలు.. స్నేహబంధాలు.. బంధుత్వాలు.. ఇలా ప్రతీ ఒక్కరిని పలుకరించి తమ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను ఏదోఒక సమయంలో నేరుగా కలుస్తూ.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని ఫోన్లో సంప్రదిస్తున్నారు.గ్రామాల్లో ఉన్నవారి నుంచి ఫోన్ నంబర్లు తీసుకుని, ఫోన్చేసి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అన్నా.. అక్కా అంటూ సంబోధిస్తూ.. ఓటేసేందుకు తప్పకుండా ఊరికి రావాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News