Friday, January 24, 2025

రూ. 4 వేల విరాళం తెచ్చిన తంటా….. 12 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మాస్కో: గత కొంత కాలం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ కు మద్దతు తెలిపిన తమ దేశ పౌరులను రష్యా కఠినంగా శిక్షిస్తోంది. ఉక్రెయిన్ కు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థకు రష్యాకు చెందిన ఓ మహిళ నాలుగు వేల రూపాయలు(51 డాలర్లు) విరాళం ఇచ్చింది. దీంతో రష్యా అధికారులు విచారణ చేపట్టి మహిళను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…..

రష్యాకు చెందిన సేనియా ఖవానా(33) అనే డ్యాన్సర్ అమెరికాకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దంపతులు లాస్ ఎంజెల్స్ లో ఉంటున్నారు. అమెరికాలో ఓ స్వచ్ఛంద సంస్థకు నాలుగు వేల రూపాయలు విరాళం ఇచ్చింది. కొంత కాలం తరువాత రష్యాకు వచ్చింది. అప్పుడు ఆమెను రష్యా అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఆమె విరాళం ఇచ్చినట్టు గుర్తించారు. ఆ స్వచ్ఛంద సంస్థ  డబ్బులను ఉక్రెయిన్ కు కోసం ఉపయోగిస్తున్నట్టు ఆమెకు తెలియదు. ఆమెను కోర్టులో హాజరుపరచగా దేశద్రోహం కింద
ఖవానాకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News