Monday, January 20, 2025

ఉక్రెయిన్‌పై మళ్లీ దాడులు మొదలు

- Advertisement -
- Advertisement -

Russia again Starts attack on Ukraine

కీవ్: తాత్కాలిక కాల్పుల విరమణ సమయం ముగిసిన వెంటనే రష్యా తిరిగి ఉక్రెయిన్‌పై దాడులు మొదలు పెట్టింది. ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నువాఖా నగరాలు లక్ష్యంగా క్షిపణి దాడులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పర్యాటక ప్రాంతమైన మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌లోని అందమైన నగరాలు శ్మశానంగా మారుతున్నాయి. ఆర్తనాదాలు, రోదనలు మిన్నుముడుతున్నాయి. దీంతో రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పౌరులు తరగబడుతున్నారు. రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ నగరంలో శనివారం వందలాది మంది ఉక్రెయిన్లు వీధుల్లోకి వచ్చారు. యుద్ధ ట్యాంకులకు కూడా వెరవకుండా నిరసనలు చేస్తున్నారు. ఈ నెల 3న ఖేర్సన్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Russia again Starts attack on Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News