- Advertisement -
మాస్కో : ఉక్రెయిన్‌లో పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించడానికి ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్ లోని మరియుపొల్, వోల్నవోఖ్ నగరాల్లో పౌరులను సురక్షితంగా తరలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. హ్యూమన్ కారిడార్ కోసం ఈమేరకు తాత్కాలికంగా ఉదయం 10 గంటల నుంచి (మాస్కో కాలమానం ప్రకారం) తమ దళాలు కాల్పులను నిలిపివేస్తాయని వెల్లడించింది. వోల్నవోఖ్, మరియుపోల్‌ను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించాయి. ఇతర దేశాల నుంచి వస్తోన్న ఒత్తిడి కారణంగా
రష్యా ఈ కాల్పుల విరమణ తీసుకున్నట్టు తెలుస్తోంది.
- Advertisement -