Thursday, January 23, 2025

ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా… 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడిలో ఇప్పటివరకు మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఉక్రెయిన్ లోని ఓ నగరంపై శనివారం జరిగిన దాడిలో మొదట ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, తరువాత మరికొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వారాంత శెలవుల సందర్భంగా పిక్నిక్‌లో పౌరులు ఉంటుండగా ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. విల్నియాన్స్ పార్కులో పిక్నిక్ శిబిరాల దుప్పట్ల అడుగునుంచి మృతదేహాలను బయటకు తీస్తుండడం ఫోటోల్లో కనిపించింది.

శనివారం సాయంత్రం 36 మంది గాయపడ్డారు. ఆదివారం సంతాప దినం ప్రకటించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని స్థానిక గవర్నర్ ఇవాన్ ఫెడరోవ్ తెలియజేశారు. అంతకు ముందు ఒకషాపు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయని ఆయన తెలియజేశారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా దాడులను ఎదుర్కోడానికి మిత్రదేశాల నుంచి ఆయుధాలు, వైమానిక దళాలు పంపాలని అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News